విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
తమ పరిపాలనలో ఎన్ని అనర్థాలు వైఫల్యాలను ఎదుర్కొన్నారో ప్రజలు గమనించాలి.
విమర్శించడం మాత్రమే చైతన్యం అనుకుంటే ప్రజలు నిలదీస్తారు!.
వడ్డేపల్లి మల్లేశం.
అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే కానీ తమ ప్రభుత్వ ఏలుబడిలో చేసినటువంటి ప్రజాప్రయోజన జన రంజక కార్యకలాపాలను ఒక్కసారి దృష్టిలో ఉంచుకోవాలి. అది తలుచుకోకుండా కేవలం అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే సిగ్గుచేటే . 91/2 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన తర్వాత ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలు వెచ్చించిన నిధులు అమలు చేసినటువంటి కార్యక్రమాలను ప్రారంభించిన సంగతి మర్చిపోకూడదు. టిఆర్ఎస్ హయాములో వేసినటువంటి శిలాఫలకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం మేము అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆసరాగా ఉన్న ప్రజలను హింసించడంతోపాటు తమ ఏలుబడిలో ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటు . యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎస్సీ ఎస్టీలను ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని అంతేకాదు అనేక రకాల హామీ ఇచ్చి ఏ హామీని కూడా నెరవేర్చకుండా కేవలం రోడ్లకు రహదారులకు భవనాలకు అనేక ఆస్తిపాస్తులకు ఖాళీగా ఉన్న భూములకు కూడా రైతుబంధును కట్టబెట్టి ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. !ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగానికి 17% కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనేక ఆకాంక్షలు ఆశయాలతో ఏర్పడిందని గొప్పగా చెప్పుకుని అంతేకాదు బంగారు తెలంగాణ అని పేరు ప్రకటించినటువంటి టిఆర్ఎస్ హయాముl0 కేవలం 6_ 7% కూడా విద్యకు నిధులను పెంచలేదంటే ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి brs ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 10% కేటాయిస్తే నిధులను తక్కువగా కేటాయించిందని vimarshinche అధికారం ఎక్కడిది నీ హయాంలో ఏమైనా మార్పు జరిగిందా ? సాగులో లేని భూములకు, పంట పండించని భూముల కూడా రైతుబంధు పేరుతో ప్రజలందరికీ సంబంధించిన నిధులను అప్పనంగా కేటాయించినటువంటి దౌర్భాగ్యమైన నీతి మీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి. అది నిజంగా అన్యాయం అక్రమం సిగ్గుచేటు కూడా . .ప్రజలను చైతన్యం చేస్తున్నామని అనేక అనర్థాలను నివారిస్తున్నామని పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం విజయవంతమైందో ఒక్కసారి టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పగలగాలి. ఇప్పటికీ వీధి కార్మికులు, అనాగరికులు పేదలు అట్టడుగు వర్గాల వారికి ఏ రకమైన ప్రభుత్వం వాళ్లku brs అధికారంలో ఉన్న నాడు ప్రవేశపెట్టారు చెబితే బాగుంటుంది. కేవలం రైతుబంధు రుణమాఫీ పేరుతోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు కానీ మీ ప్రభుత్వ హయాములో రుణమాఫీ చేయలేదు, రైతుబంధు కూడా అక్రమంగా అక్రమార్కులకు పెట్టుబడిదారులకు రోడ్లకు వంతెనలకు భూములకు అడవులకు కట్టబెట్టినటువంటి దుర్నీతి ఎవరికి తెలియదు ? అందుకే ప్రస్తుతము అర్హులైనటువంటి ఐదు ఎకరాల భూమి ఉన్నటువంటి వర్గాల వారికి మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించడం ద్వారా రైతండలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద ఉన్నది . అదే క్రమంలో సమాజం కూడా తన బాధ్యతలో భాగంగా రైతులను గౌరవించడం పోషించడం ద్వారా పేద వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ పెట్టుబడిదారులు భూస్వాములు అమెరికాలో ఉన్నటువంటి అనేక పెత్తందారీ వర్గాలకు కూడా ఇక్కడి నుండి రైతుబంధు పేరుతో సొమ్ములను జma చేసి పేరు తెచ్చుకున్నారంటే మీ ప్రభుత్వం ఎవరి పక్షము అర్థం చేసుకోవచ్చు. 0.5% కూడా లేనటువంటి అగ్రవర్ణాల అధిపత్యంలో కొనసాగినటువంటి నాటి ప్రభుత్వం ఆ వర్గాలకు కొమ్ము కాసినటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఎవరైనా ఈ ప్రభుత్వమైనా కూడా తన అగ్రవర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసిన అవసరం ఉంటుందని అర్థం చేసుకుంటేనే మంచిది . విద్యకు .ఉమ్మడి రాష్ట్రంలో 17% కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6_7 శాతంతో ముగించి పేద వర్గాలకు ద్రోహం చేసి ప్రైవేటు వర్గాన్ని పెంచి పోషించి ఒక కమిషన్ పేరుతో ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఏటా పది శాతం పెంచుకోవచ్చని తీర్మానాన్ని ఆమోదించినటువంటి టిఆర్ఎస్ ప్రజలకు విద్రోహం చేసిన ప్రభుత్వమే అవుతుంది. ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆకునూరు మురళి సారథ్యంలో వేసినటువంటి విద్యా కమిషన్ ప్రజలకు అనుకూలంగా ప్రకటించక పోతే నివేదిక సమర్పించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంతే కాదు అధికారంలో లేనప్పుడు ఆకుకూర మురళి గారు పదవి బాధ్యతలు స్వీకరించని నాడు విద్య మొత్తం ప్రభుత్వ హయాంలో ఉండాలని చెప్పి ప్రస్తుతం అధికారంలో కొనసాగినప్పుడు ఆ మాట మాట్లాడకపోవడం నిజంగా విచారకరం సిగ్గుచేటు. కూడా వాస్తవాలను మాట్లాడుకోవడానికి మేధావులు బుద్ధి జీవులు సిద్ధపడాలి కానీ ఒక ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి ప్రయత్నం చేయకూడదు అది నిజంగా అవమానకరం కూడా .
బుద్ధి జీవుల సమక్షంలో విచారణ జరిపించాలి
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేసిన ద్రోహం పైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అది కూడా బుద్ధి జీవుల సమక్షంలో జరపాలి కానీ చట్టసభల్లో కేవలం నోరు ఉందని భాష ఉందని మాట్లాడే సత్తా ఉందని అనవసరంగా ప్రశ్నిస్తే దానికి ఎవరు కూడా గుర్తింపు ఇవ్వరు .ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించి అవమానించే ధోరణిలో vyavaవరించడం నిజంగా సిగ్గుచేటు. వారు చేసిన కార్యక్రమాలు ఎవరి ప్రయోజనం కోసం పాకులాడినారో అర్థం చేసుకుంటే మనకు పూర్తిగా అవగతం అవుతుంది .పెట్టుబడిదారీ వర్గాలకు భూస్వామ్య వర్గాలకు కార్పొరేట్ సంస్థలకు టిఆర్ఎస్ మద్దతు ఇస్తూ ఏ రకంగా ఇవ్వాలా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు. విద్యారంగానికి సరి అయిన పద్దులను కేటాయించలేదు, కొఠారి కమిషన్ నివేదికను సమర్థించలేదు భారతదేశంలో పేద వర్గాలకు విద్యను బలోపేతం చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేయలేదు. ఏమైనా కేవలం 420 హామీలు ఆరు వాగ్దానాలను అమలు చేయమని చెప్పే ఏకైక డిమాండ్తో ప్రశ్నించడం సిగ్గుచేటు. విద్యావంతులు మేధావులు బుద్ధి జీవులు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు వీdi వ్యాపారులు చిరు వ్యాపారులు పేదలు అనగారిన వర్గాల యొక్క ప్రయోజనం గురించి ఏనాడు కూడా brs పార్టీ చట్టసభల్లో ప్రశ్నించలేదు. కేవలం రైతుబంధు హామీలను అమలు చేయలేదు అని ఒక కుంటెద్దు సాకుతో ప్రభుత్వాన్ని విమర్శించడంతోనే సరిపోతే మిగతా వర్గాలు మిమ్ములను సూటిపోటి మాటలతో విమర్శిస్తారని తెలుసుకుంటే మంచిది.. రైతు రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయలేదని టిఆర్ఎస్ పార్టీ అంటే పూర్తిగా మాఫీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది మరి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆ మేరకు ఏమైనా చర్యలు తీసుకున్నదా ప్రశ్నించే క్రమంలో తన చిత్తశుద్ధిని పరీక్షించుకోకుండా ఇతర పార్టీని ప్రశ్నించడం అంటే నిజంగా సిగ్గుచేటు. విద్యా, వైద్యము, సామాజిక న్యాయం వంటి ముఖ్యమైన క్రియాశీలక అంశాల పైన దృష్టి సారించవలసినటువంటి ప్రతిపక్షం కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంతో లేనిపోని నిందలు మోపడం అంటే తన బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించడమే అవుతుంది. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల కోసం పనిచేసే విధంగా డామినేట్ చేయడంతో పాటు తన పొరపాట్లను సవరించుకుంటే మంచిది. తన 9:30 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అపశృthu లను కూడా జప్తి చేసుకొని ప్రస్తుత ప్రభుత్వానికి ఆమోదం తెలిపినట్లైతేనే ప్రజలకు మేలు జరుగుతుంది .గత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు పెట్టుబడిదారులు భూస్వాములు కార్పొరేట్ శక్తులకు వంత పాడిన విషయాన్ని ఇప్పటికైనా అంగీకరించి ప్రస్తుత ప్రభుత్వానికి కొత్త మార్గంలో సూచనలు చేయడం ద్వారా ప్రభుత్వ రంగ బలోపేతం కోసం కృషి చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తన యొక్క కర్తవ్యాన్ని కొంతైనా నిర్వహించినట్లు అవుతుంది. లేకుంటే తప్పులను అంగీకరించవలసి ఉంటుంది ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటే మంచిది ఈ పరిస్థితిలకు ఏ పార్టీ కూడా అతీతం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా thappata డుగులు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది జాగ్రత్త! ప్రజల ముందు ఎవరైనా సమానమే ప్రజలకు తలవంచక తప్పదు ఏ పార్టీ ప్రభుత్వం అయినా అంతే సంగతులు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )