డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి ఒకరోజు జైలు శిక్ష 1500 జరిమానా

Apr 4, 2025 - 14:20
Apr 4, 2025 - 14:22
 0  11
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి ఒకరోజు జైలు శిక్ష 1500 జరిమానా

సూర్యాపేట, 4 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-

సూర్యాపేట జిల్లా కేంద్రం.....

గురువారం సూర్యాపేట పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించగా ఏడుగురు వ్యక్తులు పట్టు పడగా వారిని శుక్రవారం సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి బివి రమణ గారి ఎదుట హాజరు పరచగా ఒకరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు 1500 జరిమానా విధించినట్లు సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ సాయిరాం శుక్రవారం తెలిపారు. మిగతా వారికి ఫైన్ విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఎంతటి వారికైనా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చట్టాలు కఠినంగా అమలవుతున్నందున వాహనదారులు మద్యం సేవించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని సూచించారు.

 ఆర్ సాయిరాం,

ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్, సూర్యాపేట.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333