బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వం ఎందుకు...?*

Mar 18, 2025 - 14:09
Mar 18, 2025 - 14:54
 0  10

*బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వం ఎందుకు...?*

*-కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆగిపోయిన బ్రిడ్జి...*

*- సమస్యను పట్టించుకోని పాలకులు మరియు అధికారులు....*

*- బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించిన...*

*- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్..*

*జోగులాంబ గద్వాల 18 మార్చ్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.*

*ధరూర్:* మండల పరిధిలోని నీలహళ్లి మరియు పాతపాలెం మధ్యలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వం ఎందుకని, ఇట్టి సమస్యలను పాలకులు మరియు అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి *జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్* అన్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని సమితి నాయకులతో కలిసి పరిశీలించారు.

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....*

గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిలిచిపోవడం గమనర్హంగా ఉందని ఈ విషయంపై పాలకులు మరియు అధికారులు ఇట్టి సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని తెలిపారు.

నీలహళ్లి పాతపాలెం గ్రామాల మధ్యలో ఉన్న బ్రిడ్జి నిర్మాణం దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు కొనసాగుతుందని మూడు సంవత్సరాల క్రితం నుండి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి కారణం కాంట్రాక్టర్ మరియు పాలకుల నిర్లక్ష్యమే అని ఆయన తెలిపారు.

అభివృద్ధి కోసం పార్టీలో చేరుతున్నానని చెప్పిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీ అభివృద్ధి ఏంటో ఇక్కడ మీ పాలనలో అర్ధాంతరంగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం చూస్తే స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. 2014 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ హయంలో మరియు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయంలో కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనసాగుతున్నారని, బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే స్వయానా భూమి పూజ చేశారని, కానీ ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం వెనక అంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని తెలిపారు. 

కాంట్రాక్టు కమిషన్ల కోసం అభివృద్ధి పనులను అసంపూర్తిగా నిలుపుతూ, నడిగడ్డ ప్రజలను అనేక హామీలతో మరియు అభివృద్ధి పేరుతో మోసానికి గురి చేస్తున్నారని ఇలాంటి పాలకులను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.

మీ పాలనలో గద్వాల నియోజకవర్గ అభివృద్ధి నెరవేరడం లేదని, మీ అభివృద్ధిని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని అన్నారు. 

వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు బలరాం నాయుడు, మునెప్ప, ఇస్మాయిల్,రాము, జగదీష్,జమ్మన్న, ఆంజనేయులు, నాగరాజు,మల్దకల్, భూపతి నాయుడు, ప్రేమ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State