మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పై హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలి .. ఎమ్మార్పీఎస్
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పై హత్యాయత్నం కేసు నమోదు చేయగలరు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు. మేడి కృష్ణ మాదిగ నిన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పై.. మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్న పసుల రామ్మూర్తి చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఓ ప్రధాన పత్రిక ఆధారంగా నిన్న మాట్లాడిన మాటల రికార్డుగా దానిపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.. 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం సమాన పంపిణీ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఎస్సీ వర్గీకరణకు అన్ని ప్రభుత్వాలు, అన్ని కమిషన్లు, వివిధ రాజకీయ, వామపక్ష పార్టీలు, సమస్త పౌర సమాజం, మేధావి వర్గం, ఎస్సీ ఎస్టీ, బీసీ ,మైనార్టీ అగ్రకులాలు, సైతం వర్గీకరణను సమర్థిస్తూ మద్దతిస్తున్న తీరును గర్వించదగ్గ పోరాట స్ఫూర్తి కి, నిలువెత్తు నిదర్శనం సామాజిక ఉద్యమాలకు రథసారథిగా కొనసాగుతున్న అభినవ అంబేద్కర్ అయినటువంటి మందకృష్ణ మాదిగ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొట్టి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ ప్రకటనలు చేసిన రామ్మూర్తి పై తక్షణమే అత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో సమాజంలో దోషిగా నిలబడ్డ మాల స్వార్థపరులైన ఇలాంటి ఇలాంటి స్వార్థ దుర్మార్గులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.. ఈ ఫిర్యాదు చేసిన వారిలో పాల్గొన్నవారు.. ఎమ్మార్పీఎస్ నాయకులు మారి పెళ్లి జగన్ మాదిగ ఎమ్మెస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి బత్తుల వెంకటరమణ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిపర్తి గంగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పల్లెల రాములు మాదిగ ఆత్మకూరు ఎస్ మండల అధికార ప్రతినిధి మిర్యాల చిన్ని మాదిగ మేడి మహేందర్ మాదిగ మొలకలపల్లి నాగేందర్ మాదిగ కార్తీక్ మధు మహేష్ తదితరులు పాల్గొన్నారు.