బెట్టింగ్‌లకు పాల్పడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు

- ఐపిఎల్ క్రికెట్, ఆన్లైన్ జూదం, గేమ్ యాప్ లలో బెట్టింగ్ ల విషయమై పిల్లలో మార్పును గమనించాలి.
ఆకర్షణీయమైన సందేశాలు, ప్రకటనలు నమ్మి క్రీడా యాప్ లలో బెట్టింగ్ పెట్టి మోసపోవద్దు.
బెట్టింగ్ యాప్ లతో ఆర్థిక నష్టం తీవ్రంగా ఉంటుంది.
నరసింహ ఐపిఎస్ ఎస్పి సూర్యాపేట జిల్లా
ఎవరైన క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, పేయింగ్ గేమ్స్, ఆన్లైన్ జూదం రమ్మి లాంటి ఆటల్లో ఇతరత్ర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ హెచ్చరించారు. జిల్లా పరిధిలో యువత క్రీడల్లో ఆన్లైన్ బెట్టింగ్‌లు పెట్టడం, తీవ్రంగా నష్టపోవడం లాంటి అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఎస్పి గారు ఓ ప్రకటన చేస్తూ ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల మోజులో, ఇతర బెట్టింగ్ ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది సాధించడంతో ప్రతి ఒక్కరికి ఇంటర్ అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్ మీడియా సైతం యువతకు మరింత చేరువ అయింది. తద్వారా మోసగాళ్ళ మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ పాటు, ఇతరత్రా బెట్టింగ్‌ల వైపు యువత తొంగిచూడమే కాకుండా ఇంటి సభ్యులకు తెలియకుండా వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పూర్తి గా నష్టపోవడంతో పాటు కొన్ని సందర్బాల్లో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందని అన్నారు. ఐపిల్ సిజన్ ప్రారంభం అయింది. ఇది దృష్టిలో వుంచుకోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలని, ముఖ్యంగా వారు క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం అయ్యే సమయాల్లో వారి ప్రవర్తతో పాటు, వారు సెల్‌ఫోన్లలో మాట్లాడే సంభాషణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఎస్పి గారు సూచించారు. బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు గాను పెద్దఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకోసం ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, ప్రత్యేక బృందాలను వినియోగించుకొవడం జరుగుతోంది. ఎవరైన బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పి గారు వెల్లడిరచారు.