బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలి

Apr 26, 2025 - 20:53
 0  34
బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలి

తిరుమలగిరి 27 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణతో పాటు దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు గుణగంటి చంద్రశేఖర్ గౌడ్, చుక్కల సత్యనారాయణ తెలిపారు  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుండి నేటి వరకు బీసీలు అన్ని రంగాలలో అనిచి వేయబడ్డారని అన్నారు దేశాన్ని ఏలిన పాలకులు బీసీలను కేవలం రాజకీయ జెండాలు మోసే బోయిలుగా ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఎలాంటి సంక్షేమ పథకాలతో పాటు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ప్రాధాన్యత కల్పించలేదని అని అన్నారు దీనికి కారణం పాలకులే తప్ప మరెవరు కాదని చెప్పారు బీసీలలో ఎన్నో కులాలు ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడం మూలంగానే నేడు మనం వెనుకబడి పోతున్నామని అన్నారు బీసీల ఐక్యత కోసం ఇప్పటివరకు ఎన్నో సంఘాలు ఆవిర్భవించినా నేటి వరకు కేవలం పత్రికా ప్రకటనలు ధర్నాలు జై కొట్టిన వారే తప్ప బీసీల హక్కుల కోసం లోతుగా వెళ్లి పోరాటం చేసిన వారే లేరని అని తెలిపారు గ్రామ మండల రాజకీయాల్లో బీసీలు ఆర్దికంగా ఎదిగి స్థానిక సంస్థల తో పాటు అన్ని రంగాలలో పోటీచేసి మన సత్తా నిరూపించుకోవాలని వారు చెప్పారు, ఎన్నికల్లో బీసీల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుతికి కేవలం తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాల వారే తమపై పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు గ్రామాలలో బీసీలపై దాడులు చేస్తున్న ఈనాటికి పాలకులు స్పందించలేదని అన్నారు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కులపరమైన రక్షణ కల్పించాలని అని కోరారు రాష్ట్రంలో కొండ లక్ష్మణ్ ప్ బాపూజీ, గౌతు లచ్చన్న, బొజ్జ నరసింహులు తదితర నాయకుల మూలంగానే 1966 లో కాసుబ్రహ్మనంద రెడ్డి ప్రభుత్వం బీసీలకు 20% విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించింది కానీ ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అనంతరామన్ కమిషన్ మురళీధర్ రావు కమిషన్ నివేదిక బీసీల అభివృద్ధికి తోడ్పాడ్డా యని ఆయన అన్నారు రాజకీయ రంగంలో చూసుకుంటే 1980లో టి అంజయ్య ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించి0దని అన్నారు 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు అమలు చేశారని అన్నారు దేశంలో 1993లో 73 74 రాజ్యాంగ సవరణ ద్వారా పీవీ నరసింహారావు ప్రభుత్వం బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించింది చెప్పారు ఉద్యోగాల్లో మాదిరిగానే స్థానిక సంస్థల్లో మొత్తం త్ 50 శాతానికి మించరాదని డాక్టర్ కృష్ణమూర్తి సుప్రీంకోర్టులో 2010లో తీర్పు ఇచ్చిందని అన్నారు ఈ తీర్పు యావత్ బి సమాజానికి శాపంగా మారిందని ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 23 శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పిస్తున్నారు. బీసీల హక్కుల సాధన కోసమే కటకం నరసింహారావు ఆధ్వర్యంలో మన ఆలోచన సాధన సమితి స్థాపించారని వారన్నారు మేధావులు బీసీలు అందరూ యువకులు యువకులు, విద్యార్థులు కలిసి రావాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య   బీసీ సంఘం జిల్లా నాయకులు చేను శ్రీనివాస్ గిలకత్తుల రాము గౌడ్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం దేవులపల్లి గణేష్ మెతుకు నరసింహ పాశం సత్యనారాయణ చింతకాయల సుధాకర్, లోడే సాయికుమార్   తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034