బీసీ రిజర్వేషన్ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం

Sep 2, 2025 - 23:50
 0  175
బీసీ రిజర్వేషన్ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం

తిరుమలగిరి 03 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :

 బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరి పట్టణంలోని మంగళవారం నాడు స్థానిక పూలే- అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపూలే- అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రభుత్వానికి బీసీ కులాలు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు మాట్లాడుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా కుల గణన, తో పాటు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రవ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను కదిలించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగనణ చేసి 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు విద్యా, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టే విధంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు కృషిచేసినాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లును గవర్నర్ ఆమోదం తెలియజేసి బీసీ సమాజానికి న్యాయం చేస్తారని వారిపై విశ్వాసం ఉందని అన్నారు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా బీసీలు వివిధ రంగాలలో అవకాశాలు లేకపోవడం వల్ల ఓట్లకే పరిమితం కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఈ రిజర్వేషన్లను ఆమోదం తెలిపితే బీసీ లోని అన్ని కులాలు అన్ని రంగాలలో అవకాశాలు పొందే విధంగా ఉంటారని అన్నారు. ఈ బిల్లు కు సహకరించినటువంటి కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం, సిపిఐ పార్టీలకు వారు ధన్యవాదాలు తెలుపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులను ఎవరైనా రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టుకెళ్లిన, వ్యతిరేకించిన, వారు బీసీ ద్రోహులుగా చూడబడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వంగరి బ్రహ్మం, తుమ్మా చంద్రమౌళి, కడెం లింగయ్య ఎల్లెంల యాదగిరి, చేను శ్రీనివాస్, పసునూరి శ్రీనివాస్, పులిమామిడి సోమయ్య, పులిమామిడి బిక్షం, ఈశ్వర చారి, చింతకింది సోమనారాయణ, గూడూరు వెంకన్న, ముద్దంగుల యాదగిరి, సుంకరి కిరణ్, పులిమాటి వెంకన్న, వంగరి సోమకృష్ణ, రూపాని వెంకన్న, పోదిల కృష్ణ, ముద్దంగుల రాజు, రాపని రమేష్, సంపంగి పరశురామ్, ముద్దంగుల రాములు, వంగరి కిషన్, వెంగలి మధు, మద్దూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు....

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034