రైతు వ్యతిరేక కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకించండి
రైతు సంఘం జిల్లా,ఉపాధ్యక్షులు మేదరమెట్ల
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
స్థానిక కోదాడ పట్టణంలో క్విట్ ఇండియా డే సందర్భంగా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎస్ కే యం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనగా కార్యక్రమం చేయడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని దీనికి తోడుగా బడ్జెట్లో రైతుకు సరైన నిధులు కేటాయించకపోగా ఉన్న బడ్జెట్ ను తగ్గించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతూ విదేశీ కార్పోరేటర్లకు ఐదు శాతం పన్ను రాయితీ విరమించాలని వ్యవసాయ బడ్జెట్ను రైతులకు అనుకూలంగా సవరించాలని వారన్నారు.దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తున్నారని వివిధ రంగాల లో పనిచేసే కార్మికులు వీధులపాలయ్యారని వారన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక ఉద్యమాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని వారన్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయ పోగా ప్రజల పైన అనేక బారాలు మోపుతున్నారని, స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని వారన్నారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనాలు అమలు చేయడం కోసం వివిధ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టాయని వారన్నారు. కేంద్ర రాష్ట్రకార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలని లేనట్లయితే ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు. ప్రజా సంఘాల నాయకులు దాసరి శ్రీనివాస్. శరభంద రెడ్డి వెంకన్న నాగరాజు రాంబాబు వీరబాబు ఉపేందర్ తిరపయ్య ఏడుకొండలుతదితరులు పాల్గొన్నారు.