బీచుపల్లి ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ

జోగులాంబ గద్వాల 30 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో రామన్ గౌడ్, అర్చకులు సందీప్, మారుతి, ప్రహ్లాద చారి పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టత గురించి అర్చకులు ఎస్పీకి వివరించారు. అనంతరం ఎస్పీని స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ సిఐ,ఎస్ఐ లు పాల్గొన్నారు.