బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
తెలంగాణ వార్త కొండపాక :- కొండపాక: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కుకునూర్ పల్లి మండల పరిధిలో కుకునూర్ పల్లి , తిప్పారం గ్రామలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులగా బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వేలేటి రాధ రాధాకృష్ణ, రాష్ట్ర ఎంపిటిసి ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరెందర్ లు హజరైనారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యా లక్ష్మిని నిలిపివేసిందన్నారు. దీని కారణంగా పేదింటి ఆడబిడల కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు, కారు గుర్తు కే ఓటు వేసి వెంకట్ రాం రెడ్డి ని భారి మెజారిటీ తో గేలిపించుకోవాలి అని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో , ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్, తాజా మాజీ సర్పంచ్ లు కోల శ్రీనివాస్, బచ్చలి మహిపాల్, పులోజీ కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్ ల ఆకుల భద్రప్ప , రమేష్ రెడ్డి , గ్రామ పార్టీ అధ్యక్షుడు లు మల్లం అయిలయ్య , రిప్పల స్వామి , కోరె చరణ్ తదితరులు పాల్గొన్నారు