తుపత్రాల గ్రామ విద్యార్థులకు రవాణ సౌకర్యార్థం ఉత్తనూర్ మీదుగా బస్ ను నడపండి - కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న

Jul 13, 2026 - 23:35
 0  1

తుపత్రాల గ్రామ విద్యార్థులకు రవాణ సౌకర్యార్థం ఉత్తనూర్ మీదుగా బస్ ను నడపండి - కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న గౌడ్. 


 జోగులాంబ గద్వాల 13 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.


ఐజ.
 మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు (తుప్పత్రల గ్రామ)  విద్యార్థులతో కలిసి నేడు గద్వాల ఆర్టీసీ డిపో సీఐ బాల సరస్వతి ని కలిసి వినతిపత్రం అందజేసిన 
- కౌన్సిలర్ శ్రీమతి మహేశ్వరి వెంకన్న గౌడ్.

- ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు మరియు ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ రాజు మాదిగ.

-  BRS నాయకులు ఉత్తనూరు ఉప సర్పంచ్ రామచంద్రారెడ్డి.

కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న గౌడ్  మాట్లాడుతూ తుపత్రాల గ్రామానికి చెందిన సుమారు 45 మంది విద్యార్థులు ఉత్తనూరు గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఉత్తనూరు పాఠశాలకు ప్రతిరోజూ కాలినడకన వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉందని, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కొత్తపల్లి వరకు నడిచే ఆర్టీసీ బస్సును ఉదయం, సాయంత్రం ఉత్తనూరు మీదుగా నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఐ బాల సరస్వతి  సానుకూలంగా స్పందించారు..

అనంతరం గద్వాల కలెక్టర్ కార్యాలయంలో గౌరవ కలెక్టర్  అందుబాటులో లేకపోవడంతో ఏఓ శ్రీ రాంభూపాల్ కి ఇదే అంశంపై మరో వినతిపత్రాన్ని సమర్పించి, విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, తుపత్రాల గ్రామ అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో ఉన్న పాత, నిరుపయోగంగా మారిన నీటి ట్యాంకును తొలగించేలా సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని గతంలో విన్నవించామని దయచేసి దానిని త్వరితగతిన కూల్చివేయాలని  కౌన్సిలర్ మహేశ్వరి వెంకన్న గౌడ్  ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు...

ఈ కార్యక్రమంలో  భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు వి వీరేష్, బి.ఆర్‌ఎస్ నాయకులు సమరసింహారెడ్డి గారు, తెలుగు రామకృష్ణ , పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333