నాగారం మండలం అధ్యక్షుని రేసులో వెంకన్న యాదవ్

May 18, 2026 - 06:26
 0  228
నాగారం మండలం అధ్యక్షుని రేసులో వెంకన్న యాదవ్

  నాగారం మండల కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం అవసరం.

మండల అధ్యక్ష పదవి రేసులో బయ్యం వెంకన్న యాదవ్ పేరు. 

పార్టీ శ్రేణుల్లో ప్రధాన చర్చ - 

క్షేత్రస్థాయిలో కష్టపడే వారికి అవకాశం ఇవ్వాలి అని కార్యకర్తల డిమాండ్.

 

నాగారం 18 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

నాగారం మండల కాంగ్రెస్ పార్టీ కి బలమైన మండల పార్టీ నాయకత్వం అవసరమని మండల రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగారం మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై రాజకీయాల్లో ప్రస్తుతం బయ్యం వెంకన్న పేరు ప్రధాన చర్చగా మారింది. పార్టీ కోసం 23 సంవత్సరాలుగా నిస్వార్థంగా పనిచేస్తూ కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపిన నాయకుడిగా ఆయనపై పార్టీ వర్గాల్లో విశ్వాసం పెరిగింది. తెలంగాణ ఉద్యమకారులు, బిసి నాయకులు, నాగారం మండల ప్రజలు నాగారం మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బయ్యం వెంకన్న కు అవకాశం ఇవ్వాలని మండల మేధావి వర్గం ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడికి సముచిత గుర్తింపుగా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీకి బలమైన బిసి నాయకత్వం అవసరం నాగారం మండల కాంగ్రెస్ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు ఇవ్వడం ద్వారా యువతలో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకుడిగా బయ్యం వెంకన్న పేరు ముందుకు రావడం గమనార్హం. యువత, రైతులు, సాధారణ కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధం పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.

 

"సాధారణ కార్యకర్త నుంచి ప్రభావవంతమైన నాయకుడిగా"

బయ్యాం వెంకన్న యాదవ్ రాజకీయ ప్రస్థానం సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్లో తిరుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడిగా ఆయనను అభిమానులు అభివర్ణిస్తున్నారు. మొదట సి పి ఐ ఎం ఎల్ పార్టీ లో పని చేసి దామోదర్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 2003 లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని ఆయనకు సన్నిహితులు చెబుతున్నారు.

 

"నాడు దామన్న బంధం.. నేడు సామేల్ ఆశీస్సులు అండ దండ"

బయ్యాం వెంకన్న కు దామోదర్ రెడ్డి తో మంచి అనుబంధం. ముఖ్యంగా స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రజా సేవా దృక్పథం ఆయనను ప్రభావితం చేసిందని కార్యకర్తలు చెబుతున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలలో ఎమ్మెల్యే మందుల సామేల్ నాయకత్వంలో కూడా ఆయన పార్టీ కోసం చురుకుగా పని చేస్తూ పలు గ్రామల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేశారని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

 

"రైతులతో మమేకమైన నాయకత్వం"

రైతు కుటుంబంలో పుట్టి రైతుగా ఉన్నా అనుభవం బయ్యాం వెంకన్న రైతు సమస్యలపై మంచి అవగాహనను తీసుకొచ్చింది. పంట ధరలు, మార్కెట్ సమస్యలు, రైతుల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. రైతులతో పాటు కూలీలు, చిన్న వ్యాపారులు, యువతతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. గ్రామీణ ప్రజల మనోభావాలను దగ్గరగా అర్థం చేసుకునే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.

 

"సామాజిక సేవలో ముందుండే వ్యక్తిత్వం"

రాజకీయాలతో పాటు సామాజిక సేవలో కూడా బయ్యాం వెంకన్న యాదవ్ చురుకుగా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి సహాయం చేయడం, ప్రజా సమస్యలపై స్పందించడం, యువతకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి అంశాల్లో ఆయన ముందుంటారని స్థానికులు చెబుతున్నారు. స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు.

 

"కార్యకర్తల్లో పెరుగుతున్న ఆశాభావం"

నాగారం మండల కాంగ్రెస్ కార్యకర్తల్లో ప్రస్తుతం ప్రత్యేక ఆశాభావం కనిపిస్తోంది. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులకు ఈసారి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. బయ్యాం వెంకన్న యాదవ్ పేరు మండల అధ్యక్ష పదవికి బలంగా వినిపిస్తుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. క్షేత్రస్థాయిలో అందరితో కలిసి పనిచేసే నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

"యువతతో బలమైన అనుబంధం"

రాబోయే రాజకీయ పరిణామాల్లో యువత పాత్ర కీలక మవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాంటి సమయంలో యువతతో నేరుగా మమేక మయ్యే నాయకుడికి బాధ్యతలు అప్పగించడం పార్టీకి ఉపయోగ పడుతుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా బయ్యాం వెంకన్న యాదవ్ కు మండలంలో మంచి పేరు ఉందని స్థానికులు చెబుతున్నారు.

 

కలగోలుపు తనమే తన బలం

సమాజం లో కలగలుపు తనము తో తన ప్రధాన బలమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మండలం లో అందరిని కలుపుకొని పోయే తత్వం తన రాజకీయ ఎదుగుదలకు ప్రధాన కారణమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

"నిస్వార్ధంగా పనిచేసే నాయకులను గుర్తించాలి"

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో కూడా నిబద్ధతతో పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని బాధ్యతలు కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. నాగారం మండల కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బయ్యాం వెంకన్నకు అప్పగిస్తే పార్టీకి కొత్త ఉత్సాహం రావడంతో పాటు కార్యకర్తల్లో మరింత నమ్మకం పెరుగుతుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి