ఒంటరి వృద్ధురాలకు అండగా నిలబడ్డ గ్రామ సర్పంచ్

Apr 23, 2026 - 22:40
 0  5
ఒంటరి వృద్ధురాలకు అండగా నిలబడ్డ గ్రామ సర్పంచ్

 తిరుమలగిరి  24 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ఇటీవల ఒంటరి వృద్ధురాలు ఇంట్లో షార్ట్ సర్క్యూట్... 

నిత్యవసర సరుకులు దగ్ధం... 

కుటుంబ పెద్దగా నిలబడ్డ సర్పంచ్.. 

 తిరుమలగిరి మండల పరిధిలోని మర్రి కుంట తండా గ్రామం లో ఒంటరి వృద్ధురాలు బానోతు సత్తెమ్మ ఇంట్లో కరెంట్ సర్క్యూట్ తో ఇల్లు, నిత్యవసర సరుకులు, దుస్తులు ఖాళీ బుడిదే అయ్యాయి అందుకు గ్రామ సర్పంచ్ బానోతు రోజా లక్ష్మణ్ నాయక్ ఆమెను పరామర్శించి సత్తెమ్మకు నిత్యవసరనికి 30 కేజీల బియ్యం 2000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్తమ్మకు అన్ని విధాలుగా మనో ధైర్యాన్ని ఇచ్చి పరామర్శించడం జరిగింది .ఈ కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి ఇర్ఫాన్, ఉప సర్పంచ్ బానోతు సంధ్య శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్ నాయక్, వార్డ్ మెంబర్లు దేవా నాయక్, యాకూబ్ నాయక్, మహిళా సంఘ బంధం అధ్యక్షురాలు బాజు, గ్రామ పెద్దలు రామ్ దాన్ నాయక్, కిషన్, రాజు,సకృ, గ్రామ సిబ్బందులు లాలు, నిమ్మ,తదితరులు పలుగొనడం జరిగింది.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి