కోదాడ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం కోసం""కేంద్ర మంత్రికి వినతి పత్రం

May 15, 2026 - 21:59
May 16, 2026 - 12:56
 0  77
కోదాడ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం కోసం""కేంద్ర మంత్రికి వినతి పత్రం

 *కోదాడ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం కోసం కేంద్రమంత్రికి వినతిపత్రం.       

 తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ:: కోదాడ తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గుంటూరులో వారి క్యాంపు కార్యాలయంలో కోదాడ పోస్ట్ ఆఫీస్ కార్యాలయ భవన నిర్మాణ సాధన సమితి కన్వీనర్ కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు శ్రీ జాస్తి సుబ్బారావు గారి నాయకత్వంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. కోదాడ పట్టణం నడిబొడ్డున ఉన్న పోస్ట్ ఆఫీస్ స్థలం గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఖాళీగా వృధాగా పడి ఉన్నదని, అన్యాక్రాంతమైపోయే ప్రమాదం ఉందని, కావున వెంటనే కోదాడలో పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికై నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణ సాధనసమితి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ రావెళ్ల సీతారామయ్య గారు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు గారు సీనియర్ జర్నలిస్ట్ గంధం బంగారు గారు,కోదాడ కాకతీయ సేవా సమితి కార్యదర్శి శ్రీ వేమూరి సురేష్ గారు పాల్గొన్నారు????

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State