కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గడ్డం అంజి

May 16, 2026 - 13:53
 0  4
కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గడ్డం అంజి

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని శనివారం కోదాడలోని భవాని నగర్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గడ్డం అంజి, ఉపాధ్యక్షుడిగా బాణాల అబ్రహం, ప్రధాన కార్యదర్శిగా బండారు నాగరాజు, కోశాధికారిగా షేక్ నూరుద్దీన్, సహాయ కార్యదర్శిగా షేక్ ఫకృద్దీన్, కార్యవర్గ సభ్యులుగా బత్తుల శ్రీను, కందిబండ హరీష్, నెమ్మాది రమేష్, వసంత్, నవీన్, వాంకుడోత్ రమేష్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులు బత్తిని కృష్ణమూర్తి, కుంభజడ వెంకటేశ్వర్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం అంజి ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం మరియు ప్రాంతీయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానన్నారు. తనను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333