బాల్య వివాహాలపై పురోహితులతో మహిళాశిశు సంక్షేమ శాఖ వారి అవగాహన సదస్సు.
తెలంగాణ వార్త ,మే 27 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం :- ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు అవగాహన కార్యక్రమాలలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు దివ్య క్షేత్రం భద్రాచలం లో బాల్యవివాహాలు పై అవగాహన కార్యక్రమాలు వివాహాలు జరిపించే పురోహితులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం వారు రూప స్వాతి మాట్లాడుతూ ఆడపిల్లలకి 18 సంవత్సరాలు మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు జరిపించాలని. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించడం జరిగింది. బాల్యవివాహాలు జరిగినట్లయితే 1098 నెంబర్ కి కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి అని వివరించారు. బాల్యవివాహాల నిర్మూలన మన అందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం వారు పురోహితులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పురోహిత సంఘం అధ్యక్షులు రామా వజ్జల. రవికుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు తమ పురోహితులు జరిపించ రని , బాల్య వివాహాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేస్తామని తెలిపారు.
ఎండ్