భూ సేకరణకై రైతుల అభిప్రాయం తీసుకున్న ఆర్డీవో
తిరుమలగిరి 28 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా భూ సేకరణ కొరకు రాజస్వమండల అధికారి, తొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. రైతుల నుండి అభిప్రాయాలు తెలుసుకొని వారి అభిప్రాయాలను ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియపరుస్తానని తెలిపినారు. అనంతరం భూసేకరణ జరిగే ప్రదేశములను తహశీల్దార్ తో కలిసి సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వాతి మరియు , గ్రామ పాలన అధికారి, రైతులు పాల్గొన్నారు.