భారత రాజకీయాలలో సంచలనాల సృష్టికర్త సంక్షేమ పథకాలు రుచి చూపించిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ కి భారత రత్న ఇచ్చి సత్కరించండి

May 28, 2026 - 00:28
May 28, 2026 - 00:47
 0  0
భారత రాజకీయాలలో సంచలనాల సృష్టికర్త సంక్షేమ పథకాలు రుచి చూపించిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ కి భారత రత్న ఇచ్చి సత్కరించండి
భారత రాజకీయాలలో సంచలనాల సృష్టికర్త సంక్షేమ పథకాలు రుచి చూపించిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ కి భారత రత్న ఇచ్చి సత్కరించండి

ఎన్టీఆర్ అభిమాన సంఘాల డిమాండ్. 

అటల్ బిహారీ వాజ్పాయ్ ప్రధానిగా ఉండగానే ఎన్టీఆర్ కు, భారతరత్న. వస్తుందని ఆశించిన అభిమానులు.

భద్రాద్రి, 27 మే 2026 తెలంగాణవార్త జిల్లా స్టాపర్ :- భారత రాజకీయాలలో సంచలనాల సృష్టికర్త పేద ప్రజల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనుకబడిన వర్గాలకు చట్టసభలలో, స్థానిక సంస్థలలో ప్రాధాన్యం కల్పించిన మహానేత ఉభయ తెలుగు రాష్ట్రాలలో కేవలం 5 శాతం  మంది మాత్రమే వరి అన్నం తింటున్న రోజులలో, రెండు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా శక్తిలేని అన్ని వర్గాల ప్రజలు, వరి, అన్నం తినే విధంగా ప్రజల ఆకలి తీర్చిన నిజమైన ప్రజానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్ టి రామారావు జన్మదిన మహోత్సవం మే నెల 28న రానున్న సందర్భంగా ఆ మహానేతకు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత గౌరవ పురస్కారమైన, భారతరత్న, ఇచ్చి ఆ మహానేతను సత్కరించాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామా వజ్జల. రవికుమార్ భారత ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

ప్రాంతీయ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా  తెలుగుదేశం పార్టీని భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రజాభిమానం పొందిన మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం లో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని శతజయంతులు పూర్తి చేసుకున్న 20 కోట్ల మంది తెలుగువారి అభిమాన నేత స్వర్గీయ ఎన్టీఆర్ కి, భారతరత్న, ఇచ్చి సత్కరించే విధంగా ఏపీ సీఎం కృషి చేయాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు.

భారతరత్న స్వీకరించడంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల బేదాభిప్రాయ అభిప్రాయల వల్ల, మహానేతకు భారతరత్నం రావడంలో జాప్యం జరుగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి మహానాడులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ జన్మ దినోత్సవంనాటికి భారతరత్న ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333