జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే. ఇరిగేషన్ శాఖ లక్ష్యం.

ఇరిగేషన్ శాఖ ఈ ఈ శ్రీనివాసులు..

Jul 7, 2026 - 17:37
 0  9
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే. ఇరిగేషన్ శాఖ లక్ష్యం.
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే. ఇరిగేషన్ శాఖ లక్ష్యం.

జోగులాంబ గద్వాల జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి అనుకున్న లక్ష్యం చేరవేయడమే ఇరిగేషన్ శాఖ లక్ష్యమని. గద్వాల ఇరిగేషన్ శాఖ ఈ ఈ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన . జిల్లాకు ప్రధానంగా కృష్ణ తుంగభద్ర నదులు ఉన్న పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి ఉంది. రాజోలి బండ మళ్లింపు పథకం స్కీం ద్వారా ఆయకట్టుతోపాటు అదనంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. మల్లమ్మ కుంట భూసేకరణ పూర్తి చేస్తే నడిగడ్డ ప్రాంతంలోని లక్ష ఎకరాలకు పైగా సాగునీళ్లు అందించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగభద్ర నదిలో.9 టీఎంసీలు నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నది. త్రాగునీటి అవసరాల కోసం వీటిని వాడుకుంటున్నాం. కర్ణాటక మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే కృష్ణ తుంగభద్ర నదులు నిండి పొర్లుతాయి. దీంతో ఆయకట్టు సాగు పెరిగి నడిగడ్డ ప్రాంతం రైతాంగం సాగునీటి సమస్యలు తీరుతాయి. తుంగభద్ర నది నుంచి త్రాగు సాగునీళ్లు సమస్య తీరని ఉంది. నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి సుమారు 62 వేల ఎకరాల విస్తీర్ణం సాగునీళ్లు అందించనుంది. గూడెం దొడ్డి రిజర్వాయర్ ఎత్తు పెంచడం వల్ల 6000 ఎకరాలకు సాగునీళ్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. గద్వాల్ అల్లంపూర్ నియోజకవర్గం లోని రైతులు ప్రాజెక్టులో ప్రభావంతో సాగునీళ్లు రెండు లక్షల ఎకరాలు అందించి పంటలు పండించుకునేందుకు అణువుగా ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణతో భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి మల్లమ్మ కుంట. గట్టు సమీపంలోని రిజర్వాయర్. నెట్టెంపాడు. పనులు పూర్తి చేసేందుకు. ప్రభుత్వం ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు.

గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా సాగడానికి భూసేకరణ. సర్వేలు కొన్న సాగుతున్నాయి. నిత్యము మూడు టీములతో. పర్యవేక్షణ చేస్తూ రైతులతో సమావేశం నిర్వహించి. ఒప్పించే పన్నుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. రైతులు భూమి ఇవ్వడం వల్ల సాగు నీరు ప్రయోజనాలు. ఆయకట్టు అభివృద్ధి. సాగు పెరుగుదల. వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే సాగునీరు ప్రాజెక్టులు పూర్తి అయితే తప్ప అభివృద్ధి ఉండగానే. దీనిపై ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో. నిత్యం భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ కూడా రైతులతో మాట్లాడుతున్నారు. నది తీరం వెంబడి ఉన్న రిజర్వాయర్లు కూడా పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందించేందుకు సాగునీటి శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. తుమ్మిళ్ల. రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ ద్వారా త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జూరాల ప్రాజెక్టుతో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులు. రిజర్వాయర్ పూర్తి అయితే తప్ప సాగునీటి సమస్యలు ఉండవు. ఏదేమైనా ఇరిగేషన్ శాఖ అన్ని పనులు పూర్తిస్థాయిలో చేసేందుకు. ప్రభుత్వం. రైతులు ప్రజాప్రతినిధులు నీటి సంఘాలు. ఉన్నతాధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333