బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్

మునగాల 28 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి:-
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జన్మదిన వేడుకలు మునగాల మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల గోపాలరావు సారథ్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ చెప్పిన సమాజమే దేవాలయం ప్రజల దేవు ళ్ళు అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకోసం శ్రమిస్తామని ఆయన చూపినమార్గాన్ని
అనుసరిస్తూ చంద్రబాబు నాయుడుగారి సారధ్యంలో నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామని ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని అధ్యక్షుడు నాదెళ్ల గోపాలరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ నాయకులు జంగిలి గోపి గాడిపర్తి మోహన్
రావు దేవినేని రాఘవేంద్రరావు చలసాని మాధవరావు మామిడి గురునాథంవేట అశోక్ షేక్ సైదా కాజెల్లి సైదులు
రఘు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను పలువురు కొనియాడారు అనంతరం జండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచుకున్నారు.