గ్రూప్ 1‌లో సత్తాచాటిన గొర్లఖాన్ దొడ్డి యువకుడు

Mar 12, 2025 - 14:59
Mar 12, 2025 - 15:02
 0  24
గ్రూప్ 1‌లో సత్తాచాటిన గొర్లఖాన్ దొడ్డి యువకుడు

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. ఎన్నో అవాంతరాల తరువాత ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవ్వడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 563 గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. గతేడాది ఆక్టోబర్ లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష్లలకు 21,093మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్ఫత్తిలో తుది జాబితా వెల్లడించనుంది.గట్టు మండలంలోని గొర్లఖాన్ దొడ్డికి చెందిన రవి కుమార్ గౌడ్.. 458.5 మార్కులు సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విష్ణు ఐఏఎస్ అకాడమి సహకారంతో మార్కులు సాధించినట్లు తెలిపాడు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State