ఘనంగా ఎన్టీఆర్ 13వ జయంతి వేడుకలు
మునగాల 28 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి
మునగాల మండల పరిధిలోని నరసింహాపురంలో గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఆధ్వర్యంలో. ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరంం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. యుగాలు గడిచిన తరగని అభిమానాన్ని చూరగొన్న. మహా నాయకుడని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు. రాజకీయంగా. అవకాశాలను కల్పించి. వారికి రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన మహా నాయకుడని. కేవలం రాజకీయాల్లోనే కాకుండా. సినీ రంగంలో. మకుటం లేని మహారాజుగా. వెలుగొందిన. గొప్ప నటుడని. పేదల కోసం. పక్కా ఇల్లు రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు. అందించి. కూడు గూడు గుడ్డ. అనే నినాదంతో. ప్రజలకు చేరువైన గొప్ప నాయకుడని. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని భావించి. ఎక్కడ అవినీతికి తావు లేకుండా పరిపాలించిన నాయకుడని. నేటి తరానికి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని ఆశయాలు సాధించేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చెరువుపల్లి గోపి. భారీ లక్ష్మయ్య. పుల్లూరి ఆదినారాయణ. కన్నె బోయిన విజయ్. వీరబోయిన శ్రీను .కేశ బోయిన వెంకన్న .రేవూరి బాబు. అయినాల వాసు. అల్లి చిన్న వెంకయ్య. షేక్ మన్సూర్. దాసోజు బ్రహ్మయ్య. కారంగుల పుల్లయ్య. వీరబోయిన వీరస్వామి. మాదాసు నరేష్. వీరబోయిన గురవయ్య. అక్కులు తదితరులు పాల్గొన్నారు