ఫీజులేమో వేలలో, లక్షలలో...వసతులు మాత్రం శూన్యం

Aug 13, 2025 - 19:36
 0  24

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

స్కూల్ ఒక చోట... ఆటలు ఆడించేది ఇంకో చోట.

 జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతిభది : గద్వాల జిల్లా కేంద్రంలోని విశ్వభారతి టెక్నో ప్రైవేట్ హైస్కూల్ లో వసతులు లేక విద్యార్థులను బయటకు తీసుకువచ్చి ఒక ప్రైవేటు స్థలంలో ఆటలాడిస్తున్నారు. అదేవిధంగా ఆ స్కూల్లో బాత్రూంలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు.ఫైర్ సేఫ్టీ లేదు, ఇరుకైనా తరగతి గదులు. ఉదయం ప్రార్థన చేయించడానికి కూడా స్థలం లేదు. అదొక లాడ్జ్ టైపు ఆకారంలో ఆ యజమాని స్కూల్ ను నిర్వహిస్తూ వేల రూపాయలలో ఫీజులను దోపిడి చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. తక్షణమే ఆ స్కూల్ యొక్క అనుమతులను రద్దు చేయాలి.  విద్యా చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లకు ప్లేగ్రౌండ్ ఉండాలి కానీ అవి ఏమీ లేకుండానే ప్రైవేట్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు.  నడిగడ్డలో ప్రైవేటు స్కూల్లో ఫీజుల దోపిడీ రోజురోజుకు పెరుగుతూపోతున్నది. వసతులు ఏం లేకున్నా కార్పొరేట్ స్థాయిలో సామాన్య తల్లిదండ్రుల నుంచి రక్త జలగల్లాగా పట్టిపీడిస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన MEO లు తనిఖీలు చేయడం లేదు డిఇఓ చర్య తీసుకోవడం లేదు.  నడిగడ్డలో ఫీజులను నియంత్రించే పరిస్థితుల్లో అధికారులు లేరు. రోజురోజుకు పెంచుకుంటు పోతున్నారు తప్ప నాణ్యమైన విద్యా ను అందించడం లేదు.  నాసిరకం విద్యాను విద్యార్థులకు అందిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.  కాబట్టి తక్షణమే కలెక్టర్  ఈ స్కూళ్ల పైన తనిఖీ నిర్వహించి మౌలిక సదుపాయాలు, వసతులు లేని వాటిని తక్షణమే అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ జిల్లాలో రేకుల గుడిసె, లాడ్జ్, పసుల కొట్టాల, ఇండ్ల ఆకారాలలో ప్రయివేట్ పాఠశాల ను నిర్వహించడం విద్యా రంగానికే మాయని మచ్చ అని అన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333