కోదాడలో అధికార పార్టీ చెందిన వ్యక్తులు చేసిన దాడిలో గాయపడ్డ టిఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తిని""పరామర్శించిన

పార్టీ అధ్యక్షులు షేక్ నయుం

Sep 8, 2025 - 17:16
Sep 8, 2025 - 19:17
 0  3
కోదాడలో అధికార పార్టీ చెందిన వ్యక్తులు చేసిన దాడిలో గాయపడ్డ టిఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తిని""పరామర్శించిన

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: తేది 06-09-2025 రోజున కోదాడ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా అనంతగిరి రోడ్ లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చేసిన దాడిలో గాయపడిన వారిని BRS పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ పట్టణం 25 వార్డుకు చెందిన వారు ఏర్పాటు చేసుకున్న గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దురుద్దేశ పూర్వకంగా వారిపై దాడి చేసినారు, మహిళలను కూడా తీవ్రంగా గాయపరిచారు, జరుగుతున్న గొడవను ఆపుచేయడానికి ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ తలకాయ పగలకొట్టారు. ప్రజలకు రక్షణ కలిపించే రక్షకభటులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ దొరుకుతుందని ఆయన అన్నారు. ప్రశాంతతకు నిలయమైన కోదాడ పట్టణంలో అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని ఇలాంటి దాడులు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. పట్టణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు అని ఆయన తీవ్రంగా ఖండించాడు. ఈ దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన వారిలో BRS పార్టీ పట్టణ నాయకులు మామిడి రామారావు, అలవాల వెంకట్, సంపెట ఉపేందర్ గౌడ్, పిట్టల భాగ్యమ్మ, మేదర లలిత, కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య గౌడ్, సుంకర అభిధర్ నాయుడు, జానీ ఆర్ట్స్, చలిగంటి వెంకట్, చీమ శ్రీనివాసరావు, కర్ల నరసయ్య, గడ్డం యేసు తదితరులు ఉన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State