బిజెపి అధ్యక్షుడు గా సంద్యాల సైదులు ఏకగ్రీవo
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- బిజెపి అధ్యక్షుడు గా సంద్యాల సైదులు ఏకగ్రీవ ఎన్నిక* ఆత్మకూర్ ఎస్.. భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండలం అధ్యక్షుడిగా గట్టిగల్లు గ్రామానికి సంద్యాల సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర పార్టీ ప్రకటించిన ప్రకటనలో సైదులు ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గత 15 ఏళ్లుగా బిజెపిలో కీలకంగా ఉన్న సైదులు గట్టికల్లు ఉప సర్పంచ్ గా పనిచేశారు. గత ఏడాదికాలంగా బీ ఎస్ ఎన్ ఎల్ టెలికం అడ్వైజరి కమిటీ మెంబర్ గా పని చేస్తున్నారు. మండలంలో బిజెపి పార్టీ ఉన్నత కోసం అన్ని గ్రామాల్లో కార్యకర్తలు కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామనీ ఈ సందర్భంగా సైదులు తెలిపారు. ప్రజా సమస్యలపై ఉద్యమిచ్చేందుకు పార్టీ సహకారంతో ముందుకు వెళ్తానని, తన ఎన్నికకు సహకరించిన పార్టీ పెద్దలకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.