ప్రియతమ నాయకునికి కన్నీటి నివాళులు
జోగులాంబ గద్వాల 13 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవల్లి మండల పరిధిలోని కొండేరు గ్రామ నివాసి అయిన మన ప్రియతమ నాయకులు డాక్టర్ మంద జగన్నాథం కి నివాళులర్పించిన ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే బోయిన్ వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నివాళులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ అధికార ప్రతినిధిగా అల్లంపూర్ నియోజకవర్గ ముద్దుబిడ్డగా ఎన్నో సేవలు చేసి అల్లంపూర్ నియోజకవర్గాన్ని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపి ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అందుకుగాను ఎర్రవల్లి కూడలి నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలుగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అందె బోయిన్ వెంకటేష్ యాదవ్ ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , జోగుల రవి ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు అల్లంపూర్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు , పోలీస్ రాగన్న , పెద్ద లక్ష్మన్న , రాజ్ కుమార్ , మాజీ ఉపసర్పంచ్ పద్మ వెంకటన్న , గార్లపాడు అల్ల బకస్ , నాగరాజు , చాగాపురం అల్లభాకాశ్ , యువరాజు , నరసింహ , నారాయణ , రామ్ రెడ్డి , మునుస్వామి , సుందర్ , నరసింహ , లోక రెడ్డి , రాజు , శ్రీను , కృష్ణ సాగర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగినది.