పెద్దగట్టు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Feb 15, 2025 - 17:09
Feb 15, 2025 - 17:12
 0  13
పెద్దగట్టు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ఈ నెల 16 నుంచి ప్రారంభమైయే దురాజ్పల్లి పెద్దగట్టు(గొల్లగట్టు జాతరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ రాష్ట్ర నలమూలల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో పాటు హ కొండ తొర్టుర్, దంతాలపల్లి మహబూబబాద్, నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడెం, కోదాడ, నకిరేకల్ నుంచి దురాజ్పల్లి జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు ఆర్జీసీ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దగట్టు(గొల్లగట్టు) జాతర ప్రత్యేక బస్ సర్వీసుల పై సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్ గారు ప్రకటనలో తెలిపారు.

జాతర ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

హైదరాబాదు నుంచి సూర్యాపేటకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు

హన్మకొండ, తొర్రూర్, దంతాలపల్లి నుంచి సూర్యాపేటకు ప్రతి 30 నిమిషాలకు ఒక సర్వీసు

జనగాం, తిర్మలగిరి నుంచి సూర్యాపేటకు ప్రతి 20 నిమిషాలకు ఒక సర్వీసు

మహబూబాబాద్, బంగ్లా నుంచి సూర్యాపేటకు ప్రతి 30 నిమిషాలకు ఒక సర్వీసు

నల్గొండ ముంచి సూర్యాపేటకు జాతరకు ప్రతి 10 నిమిషాలకు ఒక సర్వీసు 

ఖమ్మం నుంచి సూర్యాపేటకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు

భీమారం-మిర్యాలగూడెం నుంచి సూర్యాపేటకు ప్రతి 30 నిమిషాలకు ఒక సర్వీసు

నేరేడువర్ల నుంచి జాతరకు ప్రతి 30 నిమిషాలకు ఒక సర్వీసు

నకిరేకల్ నుంచి జాతరకు ప్రతి 10 నిమిషాలకు ఒక సర్వీసు

సూర్యాపేట నుంచి జాతరకు

సూర్యాపేట కొత్తబస్టాండు నుంచి జాతరకు ప్రతి 3 నిమిషాలకు ఒక సర్వీసు

సూర్యాపేట పాతబస్టాండు నుంచి జాతరకు ప్రతి 20 నిమిషాలకు ఒక సర్వీసు

పీఎస్తార్ సెంటర్ నుంచి జాతరకు ప్రతి 5 నిమిషాలకు ఒక సర్వీసు 

కుడకుడ క్రాస్ రోడ్డు నుంచి జాతరకు ప్రతి 3 నిమిషాలకు ఒక సర్వీసు

 ఖమ్మం చౌరస్తా నుంచి జాతరకు ప్రతి 3 నిమిషాలకు ఒక సర్వీసు

ఆర్టీసీ అధికారుల చరవాణి నెంబరు, 7382943819 సంప్రదించండి.

ఈ నెల 16 నుంచి మొదలుకానున్న పెద్దగట్టు జాతరకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసింది. ఆదివారం మధ్యహ్నం 2 గంటల నుంచి 5 బస్సులను ప్రతి 30 నిమిషాలకు నడిపించనున్నట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండ్ పాతబస్టాండ్, పీఎస్సాఆర్ సెంటర్, ఖమ్మల చౌరస్తా నుంచి మొత్తం 60 బస్ సర్వీసులను నడపనున్నట్లు సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్ తెలిపారు. ఈ జాతర జరగే 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రతీ మూడు నిముషాలకు, అనంతరం మరో రెండు రోజులు 15 నిముషాలకు ఒకటి చొప్పును ఉంటాయని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంతో పాటు మిర్యాలగూడు. కోదాడ నుంచి ప్రత్యేక బస్ సర్వీసులను దూరజపల్లి జాతర వరకు నడుస్తాయి.

జాతర స్పెషల్ చార్జీలు.

ఆర్టీసీ ప్రాంగణము(కొత్తబస్టాండ్)

సూర్యాపేట నుండి 

పెద్దగట్లు(గొల్లగట్టు) జాతర దర్పాల్లి ఆర్టీసీ బస్టాండ్

పిల్లలకు చార్జీలు ర20

పెద్దలకు చార్జీలు 40

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333