ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం ప్రభుత్వం(పిఎంఏవై) అదనపు నిధులు..కో కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు

అడ్డగూడూరు 23 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మరియు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానం ఇందిరమ్మ ఇండ్ల కమిటీలలొ ఏ పార్టీ కార్యకర్తలనూ చేర్చకుండా కాంగ్రెస్ కార్యకర్తకు మాత్రమే ఇల్లు మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కేంద్ర సంక్షేమ పథకాలు అందిస్తుందని ఇది నిదర్శనం(పీఎంఏవై)అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. తెలంగాణలో గృహనిర్మాణ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి పీఎంఏవైతో అనుసంధానం చేసి లబ్ధిదారులకు అదనపు నిధులను అందిస్తున్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు లభించడంతో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మరింతపెరగనుంది.ఇప్పటివరకు ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద రూ.72వేల ఇస్తుండగా..ఇప్పుడు కొత్త మార్పులతో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.27వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.12వేలు కూడా ఇవ్వనున్నారు.అంటే అదనంగా రూ.39 వేలు రానున్నాయి.ఒక పేద కుటుంబం ఇంటి నిర్మాణం చేస్తుంటే..ఇంటి పనులు 90రోజుల పాటు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా చేసుకోవచ్చు.రోజుకు రూ.300 కూలీగా వస్తుంది.దీంతో ఒకేసారి ఇల్లు కూడా నిర్మాణమవుతుంది.. కుటుంబానికి ఉపాధి కూడా లభిస్తుంది.ఇలా రూ.27వేలుఅందుతాయి.ఇక మిగిలిన రూ.12వేలు ఎస్బీఎంలో టయిలెట్స్ నిర్మాణంతో పాటు.పారి శుధ్యం పనులకు కేంద్రం ఇస్తుంది.ఇలా మొత్తం రూరల్‌లో ఒక్కో ఇంటికి అదనంగా రూ.39వేలు కేంద్రం నుంచి అందుతాయి. ఒక్కో లబ్ధిదారుడికి ఇప్పుడు మొత్తం1.11లక్షలు కేంద్రం నుంచిఅందుతాయి.అడ్డగూడూరు మండలంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరూ ఈ పథకాలని వినియోగించుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గం కోకన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.