మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల అడ్మిషన్లకు ఆహ్వానం

తిరుమలగిరి 11 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్& జూనియర్ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వేముల బాలరాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ ,బైపిసి, సిఈసి ,ఎంఈసి గ్రూపులకు 40 అడ్మిషన్ల చొప్పున మొత్తం 160 సీట్లు ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు https://www.tsmodelschools.com/ అనే వెబ్సైట్ లో తెలుసుకోవచ్చని సూచించారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదని ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు తేదీ 10/05/2024 నుండి 25 / 5 /2024 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.