ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం విఫలం-సీపీఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్

సొంత మండలాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే మందుల సామేల్ అశ్రద్ధ!
అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సోమవారం రోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అడ్డగూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అడ్డగూడూరు తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తాసిల్దార్ శేషగిరిరావుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్ మాట్లాడుతూ..28,29 తేదీల్లో మండల వ్యాప్తంగా సిపిఎం పోరు యాత్ర నిర్వహించి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను స్థానిక తహసిల్దార్ కి వివరించడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రంలో ప్రధానంగా ఉన్నటువంటి చౌళ్ళరామారం నుంచి గురిజాల వరకు వెళ్లేటువంటి ప్రధాన రహదారి పనులను మధ్యంతరంగా బంద్ చేసి ప్రజలకు అసౌకర్యంగా ఎందుకు చేస్తున్నారో.. అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదేవిధంగా మండలంలో వర్షాలు ఎక్కువగా వస్తే వాగులు విపరీతంగా పోవడం వలన రవాణాకి అసౌకర్యం కలిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది.అయినా కూడా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయడంలో పనులు ప్రారంభించడంలో అశ్రద్ధ వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది.అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు, వితంతువులకు,ఒంటరి మహిళలకు,బీడీ కార్మికులకు, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను పెంచకుండా కాలం గడుపుతుందని అన్నారు.ఫెంక్షన్స్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము..అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుండు వెంకటనర్స్,సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్,మండల కమిటీ సభ్యులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు,శీలం శ్రీను,చిత్తలూరి మల్లయ్య,మాధను థామస్ తదితరులు పాల్గొన్నారు.