ప్రమాద బీమా చెక్కును అందజేసిన టిఆర్ఎస్ నాయకులు

Jun 6, 2024 - 19:09
Jun 6, 2024 - 20:05
 0  8
ప్రమాద బీమా చెక్కును అందజేసిన టిఆర్ఎస్ నాయకులు

మునగాల  06 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండల పరిధిలోని ముఖందాపురం గ్రామానికి చెందిన మాదసు సైదులు ఇటీవల కొంత కాలం కింద ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మృతి చెందిన మాదాస్ సైదయ్య కు టిఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం ఉండగా దీనికి సంబంధించి ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు చెక్కును వారి భార్య జానమ్మకు టిఆర్ఎస్ నాయకులు అందించడం జరిగింది. అనంతరం మృతుని భార్య జానమ్మ, కుటుంబం సభ్యులు టిఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా సత్యనారాయణరెడ్డి ,నూకమల రామకృష్ణారెడ్డి, లక్ష్మయ్య, ఇంద్రసేనారెడ్డి, నాగయ్య, నరసయ్య, ఉపేందర్, సతీష్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State