కర్ణాటక వాల్మీకి నిధుల కుంభకోణం: తెలంగాణ లింక్?

Aug 26, 2024 - 20:01
 0  3
కర్ణాటక వాల్మీకి నిధుల కుంభకోణం: తెలంగాణ లింక్?

గిరిజన సంక్షేమ నిధుల దుర్వినియోగం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్స్ పార్టీలను కుదిపేస్తోంది. మార్చి, ఏప్రిల్ లో జరిగిన ₹50 కోట్ల లావాదేవీలు ఎంపీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని వ్యాపారవేత్తల ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. 

కర్ణాటక మహర్షి వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ మే లో ఆత్మహత్య చేసుకోవడంతో తన సూయిసైడ్ నోట్ తో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

జూలైలో, కర్ణాటక మంత్రి బి. నాగేంద్రను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ, ఐటీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. 

V6 బిజినెస్ అనే సంస్థకు ₹4.5 కోట్ల లావాదేవీ జరిగినట్లుగా రికార్డుల్లో ఉంది. ఈ సంస్థ V6 న్యూస్ ఛానల్ యజమాని, కాంగ్రెస్స్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చెందినదని చెబుతున్నారు. 

తెలంగాణలోని ప్రధాన వార్తాపత్రికలు ఈ వార్తను విస్తృతంగా ప్రచురించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333