విద్యుత్ షాక్ తో గేదె మృతి
తిరుమలగిరి 19 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇటికాల లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన పాడి గేదే గ్రామంలోని పోతరాజు ముత్తయ్య వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ ఫార్మర్ ను రాకడంతో విద్యుత్ షాక్ తగిలి మూగజీవి మరణించింది. ఈ సంఘటన పెంపకం దారుడి ఎదుట ఆ గేదె మరణించడంతో ఆ వ్యక్తి దానిని కాపాడలేని స్థితిలో తల్లడిల్లాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. 4 గేదెలను పెంచుతున్నాడు. రోజువారి లాగానే ఉదయం వాటిని ఇంటి నుంచి తీసుకువచ్చిన తర్వాత గేదె కరెంట్ షాక్ తగిలి మరణించడం అతనిని కలిచి వేసింది. సుమారు 70,000 రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు..