మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం
తెలంగాణవార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి. నెమ్మికల్ లో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన పూడూరి సైదులు కుటుంబానికి అతని పూర్వ విద్యార్థులు 1992-93 పదో తరగతి బ్యాచ్ కు చెందిన క్లాసుమేట్స్ ఆర్ధిక సహాయం అందించి చేయితనందించారు.మొత్తం పోగైన రూ.36,500 నగదును భార్య రాజ్యలక్ష్మి కి అందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బయ్యా మల్లయ్య యాదవ్, గజవెల్లి ఉప్పలచారీ, జటంగి రామనర్సయ్య, రేపాక పద్మ, బిజిగ కళమ్మ, ధరవత్ హన్మంతు, జానకి రాములు, పరమాత్మ, సత్యనారాయణ,బెల్లంకొండా సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.