ప్రభుత్వ పథకాల్లో 5శాతం వికలాంగులకు ఇవ్వాలి*
NPRD రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య
భువనగిరి 25 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్;- రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పెన్షన్స్ పెంచుతామని ఇచ్చిన హామిని వెంటనే అమలు చేయాలని, పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 300 రూపాయలను 5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా విస్తృత సమావేశం సురుపంగా ప్రకాష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం మడవయ్య మాట్లాడుతూ పెన్షన్స్లకు కేంద్ర ప్రభుత్వం వాటా 2011 నుండి కేవలం 300 రూపాయలే ఇస్తుంది. 300 రూపాయలతో బ్రతికేది ఎట్లా? నిత్యావసర సరకుల ధరలు గడిచిన 13ఏండ్ల కాలంలో 300 రేట్లు పెరిగినవి. ధరల పెరుగుదల సూచికి అనుగుణంగా పెన్షన్స్ ఎందుకు పెంచడం లేదు.సాబ్ కా సాత్ సాబ్ కా వికాస్ అంటున్న కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ ఎందుకు పెంచడం లేదు.పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా పెంచకుండా వికలాంగుల గురించి మాట్లాడే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వికలాంగుల పెన్షన్ 6వేలు వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్స్ 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 9నెలలు గడుస్తుంది. కానీ పెన్షన్స్ పెంపు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ప్రభుత్వం నిర్ణయం కోసం 44,49,767 మంది ఆసరా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.2024 జనవరి నుండే పెంచిన పెన్షన్స్ అమలు చేస్తామని అధికారంలోకి రకంటే ముందు హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చినాక పెన్షన్ పెంపు గురించి పట్టించుకోక పోవడం, లబ్ధిదారులను మోసం చేయడమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, 2016 ఆర్ పి డి డబ్ల్యూ డి చట్టం అమలు వంటి వాటిని వెంటనే అమలు చేసే విదంగా చర్యలు తీసుకోవాలి. కాలపరిమితి ముగిసిన సదరం సర్టిఫికెట్స్ వెంటనే రెన్యూవల్ చేయాలి.వేలాది మంది సదరం సర్టిఫికెట్లపై డాక్టర్స్ సంతకాలు లేకపోవడం వలన ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్స్ సంతకాలు పెట్టె విదంగా ఉత్తర్వులు ఇవ్వాలి.2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టం కొత్తగా గుర్తించిన 14రకాల వైకాల్యలకు సదరం సర్టిఫికెట్స్ ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలి. తలసేమియా, సికిల్ సెల్, హేమోఫీలియా, అంటీజం, కండరాల క్షినత, న్యూరోలాజికల్ డిజర్దర్స్ వంటి వైఖల్యాలు కలిగిన వారికి నేటికీ కూడా ప్రత్యేకంగా సదరం సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.ఆసరా పెన్షన్ లలో కేంద్ర ప్రభుత్వం వాటా పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు తుంగభూపాల్ రెడ్డి జిల్లా నాయకులు ఉపేందర్ రెడ్డి, శ్రీహరి, కొనసోత్ అనసూయ నరసింహ, హరిబాబు, చందు, ఎదురుగట్ల కొమరమ్మ నరసింహ నిమ్మల శీను, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.