ప్రతి పరిక్షా కేంద్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్...
మూడు పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలి...
పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్ అనుమతి లేదు...
ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపించాలి...
జిల్లా కలేక్టర్ యస్ వెంకట్రావు
పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. శనివారం సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లాలోని 67 పరీక్షా కేంద్రాలకు 67 మందిని స్పెషల్ ఆఫీసర్ నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జరగబోవు మూడు పరీక్షలు స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.ఆక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. సెల్ఫోన్ అనుమతించవద్దని అందరి విద్యార్థులను తనిఖీ చేసి తదుపరి పరీక్షా కేంద్రాలకు అనుమతించాలని కలెక్టర్ చీఫ్ సూపర్నెంట్ డిఎస్ వెంకటయ్య కు తెలిపారు. పాఠశాలలోని అన్ని పదవ తరగతి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం లోక్సభ ఎన్నికలలో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. Ps no 145, 146,147 పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పన త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. భద్రతాపరంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట చీఫ్ సూపర్డెంట్ డిఎస్ వెంకటయ్య ,డివో డి వెంకన్న, తాసిల్దార్ మహేందర్ రెడ్డి.అదికారులు సిబ్బంది పాల్గొన్నారు.