ప్రతి ఒక్క రైతు పంట నమోదు చేయించుకోవాలి

Sep 5, 2026 - 15:53
 0  43
ప్రతి ఒక్క రైతు పంట నమోదు చేయించుకోవాలి

   తిరుమలగిరి 05  సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామంలో డిజిటల్స్ క్రాప్ సర్వే ను ఏవో నాగేశ్వరరావు పరిశీలించడం జరిగినది గ్రామంలో కంది పంటను నువ్వులు పంటను సోయాబీన్ పంటను మొక్కజొన్న పెసర పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా మీరు ఏ పంట వేశారు ఏ రకము పంట వేశారనేది డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న వాలంటీర్లకు సరైన సమాచారం అందించాలని కోరారు ఆన్లైన్ చేయించుకున్న వారికి మాత్రమే సన్న వరి కి బోనస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరుతడి పంటలు ఎక్కువ మొత్తంలో మండలంలో సాగు కావడం జరిగినది వర్షాభావ పరిస్థితులు వల్ల రైతులు చాలా మంది ఈ ఆరు తడి పంటలైనటువంటి కంది పెసర మినుములు వేరుశనగ నువ్వులు ఇతర పంటలు బొబ్బర్లు వేశారన్నారు ఈ కార్యక్రమంలో బండ్లపల్లి గ్రామ రైతులు డి సి ఎస్ వాలంటీరు రాజు రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి