ముంబై తాజ్ హోటల్కు బాంబు బెదిరింపు

పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ ముంబైలోని తాజమహల్ హోటల్, ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఆయా ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ ఉగ్రవాది అఫ్టల్ గురు పేరిట ఈమెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా 2008లో ముంబై తాజ్ హోటల్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.