తాళాలు వేసిన ఇండ్లలో సిలిండర్ లు కాజేసిన వ్యక్తులపై కేసు నమోదు

Sep 5, 2026 - 11:58
Sep 5, 2026 - 11:59
 0  1
తాళాలు వేసిన ఇండ్లలో సిలిండర్ లు కాజేసిన వ్యక్తులపై కేసు నమోదు

అడ్డగూడూరు 3 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పదవిలోని కోటమర్తి గ్రామానికి చెందిన పులిమామిడి వెంకటేష్ తండ్రి లక్ష్మయ్య వయసు 24 సంవత్సరాలు వృత్తి కూలి బూర్గుల పరశురాములు తండ్రి పాపయ్య వయసు 32 సంవత్సరాలు వృత్తి గ్రామ పంచాయతీ సిబ్బంది. పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.ఈ ఇద్దరు వ్యక్తులు కోటమర్తి గ్రామంలో తాళాలు వేసిన ఇండ్లలో గ్యాస్ సిలిండర్లు,ఇత్తడి వస్తువులు మరియు ఇనుప వస్తువులు మొదలగునవి దొంగతనంగా తీసుకెళ్లి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. తేదీ 3-9-2026 నాడు మలిపెద్ది సోమక్క భర్త  ముత్తయ్య  65 సంవత్సరాలు గ్రామం కోటమర్తి తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పోయిందని తన ఇంటి ప్రక్కన ఉండే వెంకటేష్ వెంకన్న పై అనుమానం కలదని  పిర్యాదు చేయగా,సదరు పిర్యాదు పై కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా సదరు వెంకటేష్, పరశురాములు కోటమర్తిలో అనుమానాస్పదంగా ఉండి తమ వద్ద వున్న సిలిండర్ ను అమ్మే ప్రయత్నం చేస్తుండగా పోలీస్ వారు పట్టుకొని విచారించగా ఇద్దరు కొంత కాలంగా వూరిలో తాళాలు వేసిన ఇండ్లలో సిలిండర్ లు , ఇత్తడి సామాన్లు,ఇనుప వస్తువులు దొంగిలించి తిరుమలగిరిలో అమ్ముతున్నారని ఒప్పుకోగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది.వీరి వద్ద నుండి 3 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.పరశురాములు కోటమర్తిలో గ్రామ సిబ్బందిగా  పనిచేస్తున్నాడని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.