అడ్డగూడూరులో యూరియా కొరకు బారులు తీరిన రైతులు
అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కొరకు బారులు తీరిన రైతులు పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణి ఒక్క రైతుకు రెండు బస్తాలు ఇవ్వడం పట్ల పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా యూరియా కొరత లేకుండా సరిపడ యూరియా ఇవ్వాలని మండలంలోని 17 గ్రామాల రైతులు కోరుతున్నారు.పంటకు అదునుకు ఇవ్వకుండా.. అదును తప్పిన తర్వాత ఇస్తే ఏమి లాభం అని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.