మతసామరస్యానికి ప్రతిక టేక్మాల్ శాహేదల్లా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు!!
ఈనెల2వతేదీన ప్రారంభం!4వతేదీనముగింపు!!
మెదక్ (టేక్మాల్ )తెలంగాణవార్త ప్రతినిధి :- మెదక్ అందోల్ నియోజకవర్గం పరధి టేక్మాల్ మండల కేంద్రం లో విశ్వమే తన కుటుంబం...ప్రేమనే మతం...మానవత్వనికి దైవత్వనికి అను సందానమే "భక్తి" అనే నానుడిని చాటుతూ...చిన్న, పెద్ద ,తారతమ్యం లేకుండా అన్ని మతాల వారిని ఒక్క చోటకు చేర్చి...భగవంతుని దృష్టిలో మానవులు అందరూ సమానులు అని చాటి చెప్పే ఫీర్ షాహ్ మహమ్మద్ మారుఫ్ హజ్రత్ శాహెదల్లా ఖాద్రీ (ర.అలై) 197 సంవత్సరం ఉర్సు ఉత్సవాలు (శాబాన్3,4,5,)నెల ఫిబ్రవరి,2,3,4 వ తేదీన టేక్మాల్ దర్గా ఆశ్రమంలో జరగనున్నాయి. ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరపటం అనవాయితిగా వస్తుంది. ప్రతి సంవత్సరం శాబాన్ నెలల్లో శాహెదల్లా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయకంగా జరుగుతాయి. శాహెదల్లా ఖాద్రీ (ర.అలై )యొక్క వంశ పరంపర పన్నేండు శకంలో హజ్రత్ బాబా ఫరీద్ మసూవుద్ గంజె శకర్ (ర.అలై)తో కలుస్తుంది. వీరు ఫారోఖీ హజ్రత్ ఫారొఖై ఆజమ్ రజి అల్లా షతరలా "అన్హ్పు"వంశంకు చెందిన వారని చరిత్ర ఉంది. ఫీర్ శాహెదల్లా ఖాద్రీ (ర.అలై)(దైవస్వరూపులు) గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ యందు హజ్రత్ మహ్మద్ రజా ఫారోఖీ (అలియాస్)రజామియా గృహంలో 1175.హీజ్రీలో దివ్య జ్యోతిగా వెలుగొందారు.వీరి తాత గారు హజ్రత్ షేక్ మహ్మద్ హమీద్ అలియాస్ కరీముల్లా త:హజ్రత్ షేక్ ఫత ఉల్లా (ర.అలై )పాక్ పటాన్ నుండి కర్నూల్ కు వలస వచ్చి కర్నూలు ను తమ చిరకాల నివాసంగా ఏర్పాటు చేసుకున్నారు. 1200 హిజ్రీలొ విరి అధ్యాత్మిక గురువు గారైన హజ్రత్ మగ్థుమ్ మోహి ద్దిన్ అలియాస్ సయ్యాదామియా( ర.అలై)విరికి ఖాద్రియా, చిష్తియా,అందు శిష్యను గ్రహన్ని ప్రసాదించారు. హజ్రత్ శాహెదల్లా ఖాద్రీ గారు నలభై ఏళ్ల వయస్సులో కర్నూల్ నుండి హైదరాబాద్ వచ్చినట్టు చరిత్ర.1249 హీజ్రీలొ టేక్మాల్ లో తమ పవిత్ర ఆత్మ పరమాత్ముని యందు లీనమైనారు.శాహెదల్లా ఖాద్రీ టేక్మాల్ కు నాలుగు సార్లు వచ్చారు అనిచరిత్ర చెబుతోంది.ఒక్క మారు 1243 హిజ్రీలొ హజ్రత్ సాహేబ్ హుస్సెన్ గారి కుమారుని మరణా వార్త విని వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ పర్చడానికి వచ్చారుఅని,1245 హిజ్రి లొ మరొ మారు వచ్చి వారం రోజుల పాటు టేక్మాల్ లొ ఉన్నారు.1248 హిజ్రిలో సాహేబ్ హుస్సేన్ గారికి "పుత్రబాగ్యం" కలిగిందని మూడవ మారు టేక్మాల్ కు వచ్చారు. ఆ సమయంలో నే "టేక్మాల్ " స్థిరనివాసం ఏర్పాటు చేసుకొమ్మని ఆయన శిష్యులు వేడుకొన్నారు.1249 హిజ్రీ శాబాన్ నెల రెండవ తేదీన శనివారం ఉదయం వీరి ప్రియ శిష్యులైన సాహేబ్ హుస్సేన్ గారిని తన చెంతకు చెర్చుకొని అప్పుడు శాహెదల్లా ఖాద్రీ గారు అధ్యాత్మిక పుస్తకాలు, అందించిన తర్వాత అందరు భోజనాలు చేశారా?నాయనా? నా సమాధి పూర్తయ్యిందా? అని ప్రశ్నించారు?! శిష్యులనుండి సమాధానం అందుకున్న కొద్ది సమయంలోనే అనూహ్యమైన శక్తి, తప శక్తి, బాహ్యమైంది. "అల్లాహూ అనే దివ్య శబ్దంతొ" ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఆ ప్రాంతం అంతా సుగంధ భరితమై దివ్య క్రాంతమైంది. పలు మహిమల ఫలితంగా శాబాన్ నెల రెండవ తేది1249 హీజ్రీ (కీర్తి శకం) 1834 సంవత్సరంన అధ్యాత్మిక బొధనలు, అల్లహూ మహిమలు చూపిన తర్వాత తమ పంచ ప్రాణాలు వదిలిపెట్టి ఐక్యం అయ్యారు. శరీరం నుండి ప్రాణాలు కోల్పోయిన దివ్య శక్తులు మాత్రం వేరుకావన్న సత్యాన్ని నిరూపించారు. అప్పుటి నుండి ప్రతి సంవత్సరం ఫీర్ హజ్రత్ శాహెదల్లా ఖాద్రీ గారి ఉర్సు 3వ మరియు 4 వ శాబాను హిజ్రీ నాడు ఉత్సవాలు టేక్మాల్ ఆశ్రమంలో జరుగుతాయి.3వ శాబాన్ రోజున సందల్, 4,వ శాబాన్ రోజున దీపారాధన, ఖవ్వాలి, 3వ రోజున కార్యక్రమాల వితరణ కార్యక్రమాలు చేపడుతారు.ఉర్సు ఉత్సవాల కోసం శాహెదల్లా దర్గ రంగురంగుల ఆలంకణతో,కన్నూలు మీర్ మీట్లు గొలిపే వివిధ విద్యుత్ దీపాలంకరణ కాంతులతొ ముస్తాబు అయింది. ఈ ఉర్సు ఉత్సవాలను కుల మతాలకతితంగా అందరు సంఘటితంగా భక్తి శ్రద్దలతో జరుపుకొవడం విశేషం.ఇక్కడ ఉన్న గురువులసమాధులు ముస్లిలవైన్నప్పటికి, "సూఫీయిజాన్ని" చాటే ఈ దర్గా ఉత్సవాలకు అన్ని మతాలవారు పాల్గొంటారు. మానవులందరి "దేవుడు ఒక్కడే" అని చాటి చెప్పిన శాహెదల్లా ఖాద్రీ సర్వ మత,సమ్మతం...మత సామరస్యనికి ప్రతికగా నిలుస్తాయి అనడానికి ఈ ఉత్సవాలు అద్దం పడుతొంది. మనిషి మనిషికి అడ్డ గొడలుగా ఏర్పడిన కుల వ్యవస్థ, మత జాడ్యంలొ మునిగి నైతిక విలువలు అధ్యాత్మిక చింతనకు దగ్గరై...హింసకు దూరమై సర్వమత సామరస్యం, ప్రేమ తత్వం,దైవత్వనికి సుమార్గం నిజమైన మాన వత్వం,తనను తాను తెలుసుకొనే మార్గాన్వేషణ తెలు స్తుందని ప్రతితి. విశ్వమే...కుటుంబం...ప్రేమే...మతం...మానవత్వనికి...దైవత్వనికి...అను సందానమే "భక్తి" అనే నానుడిని చాటూతూ అన్ని మతాల వారిని ఒక్క చోటకు చేర్చి దేవుని దృష్టిలో మానవులు అందరూ సమానమే చాటే ఉర్సు ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. శాహెదల్లా ఖాద్రీ ప్రజల దృష్టిలో ఆరాధ్యదైవంగా నిలిచారు.ఇక్కడ హిందు, ముస్లింలు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సమైక్యంగా పార్థనలు చేస్తారు.ఖురాన్, అధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రబోధనలు ప్రవహిస్తాయి. పేదలు,ధనికులు,విభిన్న జాతులవారు,అందరూ అదరించబడుతారు.ఈ ఆశ్రమంలో పార్థనలు చేయడం వల్ల కోరిన కొరిక్కలు నెరవెరుతాయని ప్రజలు, భక్తుల ప్రగాఢ విశ్వాసం. తమ తమ మొక్కులు మెక్కిన భక్తులు, కోరికలు నెరవేరిన భక్త జనులు బీదలకు దాన దర్మాలు (నియాజు)చేస్తారు. మానసికంగా గాయ పడ్డా దీన జనులకు ఈ ఆశ్రమంలో అధ్యాత్మిక ప్రబోధనలతో మనశాంతి కలుగుతొంది. ఉర్సు ఉత్సవాలు టేక్మాల్ దర్గా ఫీఠదిపతి హజ్రత్ సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హుసేన్ ఖాద్రి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఉర్సు ఉత్సవాలు ఈ నెల ,2,3,4తేదీల్లో జరగనున్నట్టు ఫీఠదిపతి తెలిపారు. ఉర్సు ఉత్సవాలు ప్రారంభ సూచకంగా మొదటి రోజున 2వ తేదిన ఆదివారం వారం నాడు టేక్మాల్ పట్టణంలోని క్రింది వాడ (గల్లీ) నుండి గ్రంథం ఊరేగింపు తిస్తారు.3వ తేదిన హమ్ దావత్, ఖవ్వాలి,నాతే మైఫీల్, ధార్మిక, ప్రవచనాలు, నాతే మూశాయిరా,4వ తేదిన వితరణ కార్యక్రమం ఉంటుందని ఖాద్రి తెలిపారు.శాహెదల్లా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాల కోసం కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, గుల్బర్గా, బీదర్, ప్రాంతాలతో పాటు, విదేశాలనుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులు,ఉచిత భోజనం,మంచి నీళ్ల సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులు ఉర్సు ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయ వంతం చేయాలని నూరుల్లా హుస్సేని ఖాద్రీ కొరారు.
టేక్మాల్ శాహేదల్లా ఖాద్రీ ఉర్సు ఉస్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరపాలి!!
దేశ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్న టేక్మాల్ శాహేదల్లా ఖాద్రీ ఉర్సు ఉస్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని జిల్లా మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ షేక్ మజ్జార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంను కొరారు.ఈ మేరకు తాము రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి దృష్టికి తిసుకెళుతున్నట్టు షేక్ మజ్జార్ తెలిపారు. టేక్మాల్ పీర్ శాహేదల్లా ఉర్సు ఉస్సవాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాలని ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మజ్జార్ తెలిపారు.