మెట్పల్లి జర్నలిస్టులకు కోరుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏంటి ?

Oct 21, 2024 - 17:55
 0  3
మెట్పల్లి జర్నలిస్టులకు కోరుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏంటి ?

కోరుట్ల మెట్పల్లి జర్నలిస్టులు అన్నదమ్ముల వలి పరిశీలించి ఉంటున్న తరుణంలో మెట్పల్లి జర్నలిస్టులకు కోరుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించి వారి మధ్య గొడవలు సృష్టించేందుకు కొంతమంది పన్నిన కుట్రలో భాగమేనని తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TWJA) రాష్ట్ర అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుండి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మెట్పల్లి ప్రాంతం లో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ వారికి కోరుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించి కలసి ఉన్న ఇరువురి మధ్య అంతర్యం ఏర్పరచి గొడవలు సృష్టించేందుకేనని స్పష్టం చేశారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన ఉన్నవారు మెట్పల్లి జర్నలిస్టులకు మెట్పల్లిలో కోరుట్లలో ఉన్న వారికి కోరుట్లలో కేటాయించి ఒక చక్కని వాతావరణంలో జర్నలిస్టుల మధ్య సత్ససంబంధాలు మెరుగుపరచాలని టైగర్ అలీ నవాబ్ హితవు పలికారు  కోరుట్ల లో కొంతమంది స్వార్థపరులు అనర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని అర్హులైన వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని కొంతమంది ఆడుతున్న ఈ నాటకం రెండు పట్టణాల ప్రజలు గమనిస్తున్నారని వారిని అర్హులైన సీనియర్ జర్నలిస్టులు ఎప్పటికైనా ప్రశ్నిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అర్హులైన వారందరికీ అధికార పార్టీ నాయకులతో పాటు కోరుట్ల శాసనసభ్యులు ఇళ్ల స్థలాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్పల్లి లో పనిచేసే జర్నలిస్టులు కోరుట్లలో ఇల్లు తీసుకోవడానికి సుముఖంగా లేనప్పటికీ వారికి ఇక్కడ ఇస్తామని చెప్పి గుడాలకు దారి తీసే ప్రయత్నాలు చేయడం మెట్పల్లి జర్నలిస్టులు గమనించారని వారు కూడా చాలామంది ఇక్కడ ఇల్లు ఉంటే మిగతా అన్ని పనులకు 9 కిలోమీటర్ల దూరంలోని మెట్పల్లికి, సమీప గ్రామాలకు వెళ్లాలంటే మరీ చాలా ఇబ్బందిగా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ కోరుట్లలో జర్నలిస్టుల కోసం నిర్మించిన ఇళ్లనన్నిటిని కోరుట్ల వారికి కేటాయించి మెట్పల్లి వారికి మెట్పల్లి ప్రాంతంలో కేటాయించినట్లయితే ఏ సమస్య లేకుండా అందరికీ సమన్యాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు చొరవ చూపి రెండు పట్టణాల జర్నలిస్టులకు న్యాయం చేకూర్చడం వలన జర్నలిస్టు కుటుంబ సభ్యులందరూ వారిని గౌరవించుకుంటారని పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333