ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

Apr 11, 2026 - 19:43
Apr 11, 2026 - 19:45
 0  9
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

 కోదండరామపురం/ మునగాల మండలంలోని కోదండరామపురం గ్రామం లో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజులపాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా మండల ప్రాథమిక ఉచిత ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యం లో అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బొబ్బిలి లావణ్య వెంకటరెడ్డి ఉప సర్పంచ్ శమ్బయ్య, వర్డ్ మెంబెర్స్,V Vinod Kumar (CHO), B.Divya(MLH P), R Kavitha And T Ramana (Mphaf) Aasha Workers', గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు వారి ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బొబ్బిలి లావణ్య వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని బీపీ షుగరు వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలను చేయించుకోవాలని కోరారు, ఈ కార్యక్రమం లో సుమారు 200 మందికి పైగా షుగర్, బీపీ పరీక్షలను నిర్వహించి వారికి ఉచిత మందులను పంపిణీ చేసారు మనకి ఇంతగా సాయ పడిన వైద్య సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు మరియు కోదండ రామాపురం గ్రామ సర్పంచ్ గ్రామపంచాయతీ పల్లె ప్రగతికి కోతుల బెడద నుండి తప్పించేందుకు చుట్టూ ఫినిషింగ్ జాలే ఏర్పాటు చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333