ప్రజా పాలన గ్రామ సభలో గందరగోళం...
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిపిఓ ను నిలదీసిన గ్రామస్తులు..
టేక్మాల్(టేక్మాల్ )జనవరి23 అందోల్ నియోజకవర్గం తెలంగాణవార్త ప్రతినిధి :- మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వేల్పుగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి సర్వేను పంచాయతీ కార్యదర్శి చేయాల్సి ఉండగా అతని స్థానంలో ప్రైవేటు వ్యక్తులతో సర్వేను నిర్వహించారని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వేల్పుగొండలో ప్రజాపాలన గ్రామసభ ను ఉదయం 9:30 గంటలకు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామానికి నూతనంగా కొత్తగా రేషన్ కార్డులు 11, ఇందిరమ్మ ఇండ్లు 280గా, రేషన్ కార్డు కలిగి ఉండి పేర్లు ఎంట్రీ చేసుకున్నవారు 61 మంది గా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 19 మందిగా అర్హులను గ్రామసభలో గుర్తించారు. ఎవరైనా ఈ పథకాలకు అర్హులైనచో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. గ్రామంలో కొంతమంది నాయకులు ఏకపక్షంతో వాళ్లకు అనుకూలంగా చెందిన వ్యక్తుల పేర్లను మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పేర్లు నమోదు చేయించారని డిపిఓ యాదయ్యకు గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. డిపిఓ యాదయ్య స్పెషల్ ఆఫీసర్ గోపాల్ గ్రామసభ జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. గ్రామసభ ఉదయం 9:30 గంటలకు మొదలై మధ్యాహ్నం సుమారు 3 గంటల వరకు అభ్యర్థుల స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది గ్రామసభ తూతు మంత్రంగా జరిగిందని, కనీస వసతులు కల్పించలేదని, సభకు వచ్చే ప్రజలు గ్రామసభ పూర్తిగా ముగిసేంతవరకు నిల్చునే ఉన్నామని,ఎందుకు సౌకర్యాలను కల్పించలేదని అక్కడున్న అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఇండ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాధాన్యత ఇచ్చి పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పలు పథకాలను మంజూరు చేయాలని అధికారులను కోరారు. రాజకీయ కోణంలోని ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేశారని గ్రామస్తులు గ్రామ సభలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ వర్తింపచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ , స్పెషల్ ఆఫీసర్ గోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రకాష్, ఈసీ బాలరాజ్,అంగన్వాడి టీచర్లు సంగమణి,కవిత,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.