కుల-వర్గ సిద్ధాంత వేత్త, దళిత బహుజన మేధావి, ఉ సా కు ఉద్యమ జోహార్లు.

Feb 19, 2024 - 18:42
 0  170
కుల-వర్గ సిద్ధాంత వేత్త, దళిత బహుజన మేధావి, ఉ సా కు ఉద్యమ జోహార్లు.

తిరుమలగిరి 20 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- అమరుడు కామ్రేడ్ ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉసా) గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ.. ఉసా 73వ జయంతి సందర్భంగా… సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య నేతృత్వంలో, నేడు ఉదయం 9:30 ని.లకు తిరుమలగిరి ఫూలే అంబేద్కర్ విగ్రహం వద్ద ఉసా కు గణమైన నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో  నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల బిక్షం, మండల అధ్యక్షుడు జనగాం మదు, కొత్తగట్టు యాదగిరి, మంగళి మహాసభ చుక్కన పల్లి శ్రీనివాస్,నాగరాజు, రమేష్, ఎం ఆర్ పిస్ ఉమ్మడి జిల్లా నాయకులు కందుకూరి సోమన్న, శ్రీను, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాం ప్రభూ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కడెం లింగయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు కిష్టునాయక్ తదితరులు పాల్గొన్నారు.  అనంతరం పుల్లాయిగూడెం లో గల ఉసా స్మారక స్థూపం వద్ద ఉసా చిత్రపటాన్ని పూల మాలలతో అలంకరించి విప్లవ జోహార్లు అర్పిటం జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్లయ్య గూడెం గ్రామానికి చెందిన ఉసా సహచరులు చిన్న బుచ్చిరెడ్డి పెద్ద పిచ్చిరెడ్డి మరియు సిపిఐ (ఎంఎల్)ఆర్ ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం,రాష్ట్ర నాయకులు పూర్ణచందర్ రావు అలాగే హిందూ బీసీ మహాసభ నాయకులు భత్తుల సిద్దేశ్వర్ తది తరులు పాల్గొన్నారు. • అలాగే 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే మూడు విప్లవ పార్టీల ఐక్యతా మహాసభల కరపత్రాన్నిఉసా స్మారక స్థూపం వద్ద సిపిఐ (ఎంఎల్) ఆర్ ఐ (మాస్ లైన్) రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం తదితరుల చేతుల మీదుగా ఆవిష్కరించటం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333