ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
గంటలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు
ఆఫ్ చేసి మూడు గంటలు అయినా ట్రాన్స్ఫార్మ్ని పట్టించుకోని విద్యుత్ అధికారులు.
జోగులాంబ గద్వాల 2 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం పరిధిలోని చాగాపురం గ్రామంలోని తొమ్మిదవ వార్డు పరిధిలోని బయట గేర్ మసీదు దగ్గర ఉన్న ట్రాన్స్ఫర్ ని విద్యుత్ అధికారుల పర్మిషన్ లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఆఫ్ చేయడం జరిగింది విద్యుత్ అధికారులకు లేదా విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసే వారిపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. గంటల తరబడి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే విద్యుత్ అధికారులు వెంటనే స్పందించాలని గ్రామాలలో విద్యుత్ లేకపోవడం వల్ల వ్యవసాయ పనులతో పాటు పలు రకాల ఇబ్బందులు ఏర్పడతాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని .ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి సమస్యలు పురాణావృతం కాకుండా చూడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.