పోలీస్ తనిఖీల్లో శనివారం 4,83,900 - రూపాయలు సీజ్. జిల్లా ఎస్పీ రితిరాజ్
జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో, సరి హద్దు చెక్ పోస్టు లలో పోలీస్ అధికారులు చేపడుతున్న వాహన తనిఖీలలో శనివారం 4,83,900/- రూపాయలను పోలీస్ అధికారులు సీజ్ చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటి కి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. మనోపాడ్ మండల కేంద్రములో నిర్వహించిన వాహన తనిఖీలో 1,00,000/- రూపాయలు, ఐజ పట్టణం లో మేడికొండ X రోడ్డు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలో 69,500/- రూపాయలు, ధరూర్ మండలo నర్సన్ దొడ్డి చౌరస్తా దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలో 60,000/- రూపాయలు, రాజోలి లోకల్ లో చెపట్టిన వాహన తనిఖీలో 102,000/- రూపాయలు, గద్వాల్ రూరల్ పరిధిలోని జమ్మి చెడ్ లో నిర్వహించిన వాహన తనిఖీలో 52,400/- రూపాయలు , ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ పుల్లూరు చెక్ పొస్ట్ దగ్గర చేపట్టిన వాహన తనిఖీలో 100,000/- రూపాయలు మొత్తం 4,83,900/- రూపాయలను ఏలాంటి రశీదు లేని వాటిగా గుర్తించి సీజ్ చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే తగిన రశీదులు ,పత్రాలు వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.