పోరాట ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ లక్ష్మీదేవికాల్వ గ్రామంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి
అడ్డగూడూరు 11 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలో భాగంగా లక్ష్మీదేవికాల్వ గ్రామ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40 వర్ధంతి నిర్వహించడం జరిగింది. వర్ధంతి కార్యక్రమానికి చాకలి ఐలమ్మ వారసులు ముని మనవాళ్ళు మధు దుర్గాప్రసాద్ ఇద్దరు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఐలమ్మ మనవాళ్లు మాట్లాడుతూ మధు, దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రనికే వనే తెచ్చిన వీర వనిత అన్ని అన్నారు ఆనాడు ధోరలను ఎదురించి పేదలకు భూముల,పండించిన పంటను పేదలను అందించడంలో క్రియ శీలక పాత్ర పోషించారు. అన్ని అన్నారు.అదే విధంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు నాయకులు ప్రాణాలు కోల్పోయారు.అలాంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతోన్మాదులు వక్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవలని చూస్తున్నారు అన్ని అన్నారు.ఆరోజు విసునురు ధోరలను చీల్చి చెందండి ధోరలను పరదోలడంలో ప్రముఖ పాత్ర పోషించింది అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు అక్కినపల్లి నర్సయ్య, సిపిఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్, వళ్ళంబట్ల శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శి బండి నర్సింహా స్వామి,ఆకుల సోమల్లు,మామిడ్ల నర్సయ్య,యాదగిరి,యాకుబ్,నాగయ్య,సతీష్,తదితరులు పాల్గొన్నారు.