చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్

Sep 11, 2025 - 19:56
 0  7
చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్

గుండాల 11 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పరిధిలోని సీతారాంపురం గ్రామ పంచాయతీ ఆవరణలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సీతారాంపురం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.


 ఈ సందర్భంగా హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తెగువను పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీతారాంపురం గ్రామపంచాయతీ ఆవరణలో  ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలంగాణ సాయుధ పోరాటంలో గణనీయమైన పాత్రను పోషించి రజాకారులను తరిమికొట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది గంజి వెంకటేశం, అంగన్వాడి టీచర్ జీ వాణి, ఆశా వర్కర్లు బొడిగె కవిత, మొగిలి పాక లావణ్య, యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగులు హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు సింగారం రమేష్, రజక సంఘం లీడర్లు పెద్దాపురం సోమరాజ్, పెద్దాపురం రవి, పెగ్గపురం రాములు, పెగ్గపురం వెంకటయ్య, పెగ్గపురం చంద్రయ్య, పోలసు మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333