పేదవాళ్లకు అండగా ఎమ్మెల్యే మందుల సామెల్

Mar 8, 2024 - 19:41
Mar 10, 2024 - 18:55
 0  138
పేదవాళ్లకు అండగా ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 9 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం మర్రికుంట తండా గ్రామ పంచాయితి కీ చెందిన బానోతు టిక్య భార్య రాజీ కి రెండు కిడ్నీలు చెడిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ చికిత్స నిమిత్తం రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ ఓ సి చెక్కును శుక్రవారం నాడు తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్యం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.

అందులో భాగంగానే గతంలో ఉన్న ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి 10 లక్షల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని అలాగే వివిధ కారణాల దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి తక్షణ ఆర్థిక సహాయం కింద నిధులను మంజూరు చేస్తున్నారని అని చెప్పారు. తమ విషయం తెలియ గానే తమకు వైద్య ఖర్చులు నిమిత్తం రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ ఓసిని అందజేసిన తుంగతుర్తి శాసనసభ్యులు  పేదల  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదవాళ్లకుు అండగా నిలిచిన మందుల సామెలు  కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034